ETV Bharat / bharat

నిందితుడితో కలిసి వైన్ ​షాపునకు వెళ్లిన పోలీసు.. మద్యం కొనుగోలుకు సాయం! - పోలీసుతో కలిసి మద్యం కొన్ని నిందితుడు

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ పోలీసు నిందితుడిని మద్యం దుకాణానికి తీసుకెళ్లాడు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి తిరిగి వచ్చే క్రమంలో ఈ ఘటన జరిగింది. పోలీసు, నిందితుడు వైన్​ షాపు ముందు ఉండటాన్ని గమనించి ఓ వ్యక్తి.. వారిని పోటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.

police-and-accused-purchased-liquor-in-uttarpradesh-photo-went-viral
నిందితుడితో కలిసి వైన్​షాపుకెళ్లిన పోలీసు
author img

By

Published : Apr 30, 2023, 10:39 PM IST

Updated : Apr 30, 2023, 11:02 PM IST

నిందితుడిని వైన్​ షాపునకు తీసుకెళ్లాడు ఓ పోలీసు. మద్యం కొనేందుకు అతనికి సాయం చేశాడు. పోలీసు, నిందితుడు కలిసి మద్యం దుకాణం ముందు ఉండటాన్ని ఫొటో తీసిన ఓ యువకుడు.. అనంతరం దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశాడు. దీంతో ఆ ఫొటో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఉత్తర్​ప్రదేశ్​లోని హమీర్​పుర్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

అసలేం జరిగిందంటే
నిందితుడిని ఓ కేసులో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్​ 151 కింద అరెస్ట్​ చేశారు పోలీసులు. అతడిని కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా.. ఇద్దరు పోలీసులు.. నిందితుడిని న్యాయస్థానానికి తీసుకెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో.. నిందితుడు ఇలా మద్యం కావాలని కోరాడు. దీనికి ఓ పోలీసు సాయం చేశాడు. దీంతో నిందితుడు మద్యం కొనుగోలు చేశాడు. నిందితుడు వైన్ షాపు ముందు ఉండటాన్ని గమనించిన ఓ వ్యక్తి.. వారిద్దరి ఫొటో తీసి సామాజిక మధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఘటనపై హమీర్​పుర్​ ఎస్పీ విచారణకు ఆదేశించారు. వైరల్​ అవుతున్న ఫొటో విషయంలో నిజనిజాలు తెలుసుకోవాల్సిందిగా.. అధికారులను ఆదేశించారు.

మార్చిలోను ఇదే రాష్ట్రంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ ఖైదీని నలుగురు పోలీసులు.. లఖ్​నవూలోని షాపింగ్​ మాల్​కు తీసుకెళ్లారు. ఖైదీని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరిగి వచ్చే క్రమంలో.. పోలీసులు అతడిని షాపింగ్​ మాల్​ తీసుకెళ్లారు. దీన్ని సైతం అక్కడున్న వారు గమనించి.. వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు. ఈ వీడియో కూడా వైరల్​ అయింది. ఘటనపై విచారణ జరిపిన పై అధికారులు.. ఘటనలో పాలుపంచుకున్న పోలీసులను సస్పెండ్ చేశారు.

మద్యం తాగి రోడ్డుపై ఏఎస్ఐ హల్​చల్​..
ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలులో ఓ ఏఎస్ఐ తాగిన మత్తులో హల్​చల్​ చేశాడు. యూనిఫాంలో ఉండి కర్నూలు నగరంలోని సెంట్రల్ ప్లాజా వద్ద.. మందు ఎక్కువై తూలుతూ దుకాణాల వద్ద కింద పడిపోయాడు. ఇది చూసిన స్థానికులు ఏఎస్ఐ దగ్గరికి వెళ్లి పట్టుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుండి తీసుకెళ్లి రోడ్డు పక్కన వదిలేశారు.. ఖాకీ దుస్తుల్లో ఏఎస్ఐ ఫుల్లుగా మద్యం తాగి నడిరోడ్డుపైనే పడిపోవడం చూసి స్థానికులు విస్మయానికి గురయ్యారు. 3వ పట్టణ పోలీసులు సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఏఎస్ఐని అక్కడి నుంచి తీసుకెళ్లారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Last Updated : Apr 30, 2023, 11:02 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.