మే 17న అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ సమావేశం కానున్నారు. విద్యా రంగంపై కొవిడ్ ప్రభావం గురించి సమీక్షించనున్నారు. వర్చువల్గా జరగనున్న ఈ సమావేశంలో.. ఆన్లైన్ బోధన, నూతన విద్యా విద్యావిధానం అమలుపై చర్చించనున్నారు.
కొవిడ్ రెండో వ్యాప్తి నేపథ్యంలో రమేశ్ పోఖ్రియాల్ నిర్వహించనున్న మొదటి సమావేశం ఇదే కానుందని విద్యాశాఖ తెలిపింది. కొవిడ్ పోరులో భాగంగా రాష్ట్ర విద్యా శాఖ చేపట్టిన చర్యల గురించి పోఖ్రియాల్ అడిగితెలుసుకోనున్నారని స్పష్టం చేసింది.
కొవిడ్ వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో ఇటీవలే సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు వాయిదా వేసింది విద్యా శాఖ.
ఇదీ చదవండి:' మోదీజీ.. గంగానది మీ వల్లే విలపిస్తోంది'