ETV Bharat / bharat

ఆ విషయంలో మోదీకి జై కొట్టిన పాకిస్థాన్​

భవిష్యత్తులో వచ్చే వ్యాధులను అరికట్టడానికి దేశాలు పరస్పరం సహకరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు పాకిస్థాన్ స్వాగతించింది. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఒక దేశంలోని వైద్యులు మరో దేశానికి వెళ్లడానికి వారికోసం ప్రత్యేక వీసాలను రూపొందించాలని ఇటీవల మోదీ అన్నారు. అందుకు పాకిస్థాన్​తో పాటు 10 దేశాలు మద్దతు పలికాయి.

PM modi
ఆ విషయంలో మోదీకి జై కొట్టిన పాకిస్థాన్​!
author img

By

Published : Feb 19, 2021, 1:04 PM IST

భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేశాలు పరస్పర సహకారంతో, ప్రత్యేక కార్యచరణను రూపొందించుకోవాలని ప్రధాని మోదీ ఇటీవల సూచించారు. అందుకు పాకిస్థాన్​తో సహా పది దేశాలు మద్దతు పలికాయి. కొవిడ్​-19 వల్ల వచ్చిన సమస్యలను, అనుభవాన్ని, వ్యాధి సంబంధిత అంశాల్ని చర్చించడానికి భారత్​, సార్క్​తో పాటు మారిషస్, సెశెల్స్​ దేశాల నిపుణులతో సమావేశం నిర్వహించింది.

ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఒక దేశంలోని వైద్యులు మరో దేశానికి వెంటనే వెళ్లడానికి వీలుగా వారికోసం ప్రత్యేక వీసాలు తీసుకురావాలని సమావేశంలో పాల్గొన్న దేశాలను ప్రధాని మోదీ కోరారు. అంతేకాకుండా దేశాల విదేశాంగ మంత్రులు చర్చించుకుని ఎయిర్​ అంబులెన్స్​ల​కు సంబంధించి వైద్యసంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించారు.

"కొవిడ్​-19 వాక్సిన్​ సమాచారాన్ని పంచుకొని, టీకాను మరింత మెరుగ్గా మన దేశాల ప్రజలకు ఇవ్వడానికి ప్రాంతీయ కార్యచరణను రూపొందించుకోలేమా? వ్యాధిసంబంధిత సాంకేతికత సాయంతో భవిష్యత్తులో మహమ్మారులు రాకుండా చూసేందుకు ప్రాంతీయ కార్యచరణనను ఏర్పరచుకోలేమా?"

-నరేంద్ర మోదీ, భారత ప్రధాని

వీటితో పాటు మోదీ ఇచ్చిన ఐదు సూచనలకు పది దేశాలు మద్దతు పలికాయి. అంతేకాకుండా దేశాల మధ్య ఆరోగ్య సంబంధిత పథకాల సమాచారాన్ని పంచుకోవాలని మోదీ కోరారు.

ఇదీ చూడండి: నేడు కేరళలో పలు ప్రాజెక్టులు ప్రారంభించనున్న మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.