ETV Bharat / bharat

'రైతులపై దాడితో దేశం బలహీనం' - ప్రధానిపై రాహుల్ తీవ్ర విమర్శలు

రైతు ఉద్యమానికి సంబంధించి మోదీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. దేశానికే వెన్నెముక అయిన అన్నదాతలపై దాడికి పాల్పడుతూ భారత్​ను బలహీనపరుస్తున్నారని ట్విట్టర్​ వేదికగా ధ్వజమెత్తారు. మోదీ పాలన వల్ల దేశంలోని అసాంఘిక శక్తులే లబ్ధి పొందుతున్నాయని మండిపడ్డారు.

PM weakening India by attacking farmers: Rahul
'రైతులపై దాడి చేస్తూ భారత్​ను బలహీన పరుస్తున్న ప్రధాని'
author img

By

Published : Jan 29, 2021, 5:36 PM IST

దేశానికే వెన్నెముక అయిన రైతుపై దాడికి పాల్పడుతూ మోదీ ప్రభుత్వం భారత్​ను బలహీన పరుస్తోందని ఆరోపించారు కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ. మోదీ పాలన వల్ల అంసాంఘిక శక్తులే బలపడుతున్నాయని ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.

" మన రైతులు, కార్మికులపై దాడికి పాల్పడుతూ దేశాన్ని ప్రధాని మోదీ బలహీన పరుస్తున్నారు. మోదీ పాలనలో దేశంలోని అసాంఘిక శక్తులే లాభపడుతున్నాయి.

---రాహుల్ గాంధీ, ,కాంగ్రెస్​ అగ్రనేత

PM weakening India by attacking farmers: Rahul
కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్​

'కేంద్ర హోం మంత్రి స్పందించాలి'

ఆందోళనకారులు ఎర్రకోటలోకి ప్రవేశిస్తుంటే కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. వారిని ఎందుకు అడ్డుకోలేదన్నారు. విద్రోహ శక్తులను ఎర్రకోట పరిసరాల్లోకి పంపటంపై హోం మంత్రి స్పందించాలని డిమాండ్​ చేశారు.

కేంద్రం రైతులతో చర్చలు జరిపాలన్నారు రాహుల్. సమస్యకు సరైన పరిష్కారం.. చట్టాలను రద్దు చేయటమేనని స్పష్టం చేశారు. అన్నదాతలు ఇంటికి వెళ్తారని కేంద్రం అనుకోవద్దన్నారు. సమస్యను పెద్దది చేయటం తమ అభిమతం కాదని.. పరిష్కారమే తమకు కావాలన్నారు.

'రైతుల నమ్మకాన్ని చెడగొట్టటం పాపం'

కాంగ్రెస్​ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా ట్వీట్

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా సైతం ట్విట్టర్​ వేదికగా కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు.

"రైతుల నమ్మకమే దేశానికి మూల ధనం. వాళ్ల నమ్మకాన్ని వమ్ముచేయడం నేరం. రైతుల గొంతుకను పట్టించుకోకపోవటం, అన్నదాతలను భయభ్రాంతులకు గురిచేయటం పాపం. రైతులపై దాడి అంటే దేశంపై దాడి చేయటమే. ప్రధాని.. దేశాన్ని బలహీన పరచొద్దు."

--ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్​ నాయకురాలు

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలంటూ వేల మంది అన్నదాతలు రెండు నెలలుగా దేశ రాజధానిలో ఆందోళనలు చేపడుతున్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి : విపక్షాల తీరు దురదృష్టకరం: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.