ETV Bharat / bharat

'తన ఇద్దరి మిత్రుల కోసమే మోదీ తాపత్రయం'

సాగు చట్టాలతో దేశ వ్యవసాయ రంగాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ఇద్దరు మిత్రులకు అప్పగిచాలనుకుంటున్నారని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. ప్రజలకు మోదీ.. ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలు అనే ఆప్షన్లను ఇచ్చారని అన్నారు.

rahul comments on pm modi
'తన ఇద్దరి మిత్రుల కోసమే మోదీ తాపత్రయం'
author img

By

Published : Feb 13, 2021, 4:49 PM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ఇద్దరు స్నేహితులకు మొత్తం దేశ వ్యవసాయరంగాన్ని అప్పగించాలనుకుంటున్నారని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. అందుకే నూతన సాగు చట్టాలను తీసుకువచ్చారని అన్నారు. రాజస్థాన్​లోని రూపాన్​గఢ్​లో రైతులతో రాహుల్​ సమావేశమయ్యారు.

"వ్యవసాయ రంగం అంటే.. రైతులు, చిన్న మధ్యతరహా వ్యాపారులు, కూలీలు, వంటి 40 శాతం మంది వ్యాపారం ఇది. ఈ మొత్తం వ్యాపారాన్ని నరేంద్ర మోదీ తన ఇద్దరు స్నేహితులకు అప్పగించాలని చూస్తున్నారు. అందుకే నూతన సాగు చట్టాలను తీసుకువచ్చారు. ప్రజలకు మోదీ కొన్ని ఆప్షన్లు ఇచ్చారు.. అవి ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలు. "

--రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

అయితే.. ​ మోదీ ఇద్దరు స్నేహితుల పేర్లను మాత్రం రాహుల్ వెల్లడించలేదు. ఈ సమావేశంలో రాహల్​.. ట్రాక్టర్​ నడపగా.. ఆయన పక్కన రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​, రాజస్థాన్​ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్​ సింగ్​ దోస్త్రా కూర్చున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్​ మాకెన్​, సచిన్​ పైలట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రాహుల్​ దేశ వినాశకారిగా మారుతున్నారు: నిర్మల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.