ETV Bharat / bharat

క్షేత్రస్థాయి అధికారులతో నేడు ప్రధాని సమీక్ష - జిల్లా అధికారులతో మోదీ వర్చువల్ భేటీ

పలు రాష్ట్రాలు, వివిధ జిల్లాల అధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు వర్చువల్​గా సమీక్ష జరపనున్నారు. కొవిడ్​ కట్టడిలో భాగంగా చేపట్టిన చర్యలపై చర్చించనున్నారు.

PM Modi
ప్రధాని నరేంద్ర మోదీ, మోదీ సమీక్ష
author img

By

Published : May 18, 2021, 5:01 AM IST

దేశంలో కొవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదవుతున్న పలు రాష్ట్రాలు, జిల్లాల క్షేత్రస్థాయి అధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మాట్లాడనున్నట్లు పీఎంఓ కార్యాలయం తెలిపింది. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కరోనాపై సాగిస్తున్న పోరుకు సంబంధించి ఆయా అధికారులు వారి అనుభవాలు, సూచనలు, సిఫార్సులు ప్రధానికి చెప్పనున్నారు.

ఈ సమీక్షలో.. కొవిడ్​ను కట్టడి చేయడంలో విజయం సాధించిన అధికారులు తమ ప్రణాళికలను పంచుకోనున్నట్లు ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది.

కర్ణాటక, బిహార్, అసోం, ఛండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, దిల్లీ ప్రాంతాల్లోని అధికారులు ఈ సమీక్షకు హాజరుకానున్నారు. తొలుత.. 9 రాష్ట్రాల్లోని 46 జిల్లాల అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. మే 20న కూడా ఇదే మాదిరిగా అధికారులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు మోదీ.

ఇదీ చదవండి:కొవిడ్ మార్గదర్శకాల నుంచి ప్లాస్మా చికిత్స తొలగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.