ETV Bharat / bharat

కేరళ, తమిళనాడులో ప్రధాని పర్యటన

కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటనలో భాగంగా కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈక్రమంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని.

PM to inaugurate slew of projects in Kochi on Sunday
కేరళలో రూ.6వేల కోట్ల ప్రాజెక్టులను ఆవిష్కరించనున్న మోదీ!
author img

By

Published : Feb 14, 2021, 5:28 AM IST

తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆత్మనిర్భర్ భారత్​ను వేగవంతం చేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులు దేశ పౌరుల 'ఈజీ ఆఫ్ లివింగ్'కు ఊతమిస్తాయని ట్వీట్టర్ వేదికగా తెలిపారు.

ఉదయం 11:15 గంటలకు తమిళనాడు చేరుకోనున్న ప్రధాని.. చెన్నైలోని అర్జున్​ మెయిన్​ బాటిల్​ ట్యాంక్​ (ఎంకే -1ఏ)ను ఆర్మీకి అప్పగిస్తారు. తర్వాత పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.

అనంతరం కేరళలోని కొచ్చి చేరుకుని పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. దీనిలో భాగంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు చెందిన ప్రొపైలిన్ డెరివేటివ్ పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ (పీడీపీపీ)ను జాతికి అంకితం చేస్తారు. కొచ్చి పోర్టులో సౌత్ కోల్ బెర్త్ పునర్నిర్మాణానికి శంకుస్థాపన సహా చేస్తారు.

ఈ ప్రాజెక్టులు ఈ రాష్ట్రాల వృద్ధి వేగాన్ని పెంచుతాయని.. పూర్తి అభివృద్ధి సామర్థ్యాన్ని గ్రహించే వేగానికి ఊతమివ్వడంలో సహాయపడతాయని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.

ఇదీ చూడండి: 'ఆ 2.5 లక్షల మందిపై కేసులు ఎత్తేస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.