ETV Bharat / bharat

నేడు భాజపా ఆవిర్భావ దినోత్సవం- మోదీ ప్రసంగం - ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

భాజపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలతో మంగళవారం వర్చువల్​గా భేటీ కానున్నారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా అగ్రనేతలు పాల్గొననున్నారు.

PM to address BJP workers across country on party's foundation day on Apr 6
నేడు భాజపా ఆవిర్భావ దినోత్సవం- ప్రసంగించనున్న మోదీ
author img

By

Published : Apr 6, 2021, 5:05 AM IST

నేడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న భాజపా కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వర్చువల్​గా సాగే ఈ కార్యక్రమం వివిధ డిజిటల్, సామాజిక వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇందులో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కీలక నేతలు కూడా పాల్గొననున్నారు.

ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద చర్చా కార్యక్రమాలు నిర్వహించనున్నారు పార్టీ నేతలు. పార్టీ తత్వం, సంస్కృతి, విధానాలపై చర్చించనున్నట్లు భాజపా జాతీయ మీడియా అధికార ప్రతినిధి అనిల్ బలూనీ వెల్లడించారు.

జన సంఘ్, జనతా పార్టీల విలీనంతో 1980లో భాజపా ఏర్పడింది. 1984లో తొలిసారి లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 2 స్థానాలతో తన ప్రస్థానం మొదలుపెట్టింది. 2014లో మొదటి సారి అధికారంలోకి వచ్చిన భాజపా, 2019లోనూ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపిస్తోంది.

7న పరీక్షా పే చర్చ..

విద్యార్థులతో 'పరీక్షా పే చర్చ' కార్యక్రమం ఏప్రిల్ 7న జరగనుందని సోమవారం వెల్లడించారు ప్రధాని మోదీ. వర్చవల్​గా సాగే ఈ భేటీ సాయంత్రం 7గంటలకు ప్రారంభంకానుంది.

ఇదీ చూడండి: '400మంది నక్సల్స్​.. బుల్లెట్ల వర్షం కురిపించారు '

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.