ETV Bharat / bharat

సీఎంలకు మోదీ ఫోన్- టీకా కోసం కేజ్రీ డిమాండ్​ - టీకా కోసం కేజ్రీవాల్ డిమాండ్

మహారాష్ట్ర, తమిళనాడు, త్రిపుర రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఆయా రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేసిన ఆయన.. కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు, తమకు 2.6 కోట్ల టీకా డోసులు అందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.

modi kejri uddhav
సీఎంలకు మోదీ ఫోన్- టీకా కోసం కేజ్రీ డిమాండ్​
author img

By

Published : May 8, 2021, 1:35 PM IST

Updated : May 8, 2021, 2:25 PM IST

కరోనా ఉద్ధృతిపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ఫోన్ చేసిన ఆయన.. రాష్ట్రంలో పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆంక్షలు అమలవుతున్న తీరుపై చర్చించారు.

కరోనా రెండో దశను ఠాక్రే ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందని మోదీ ప్రశంసించారని మహారాష్ట్ర సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆక్సిజన్ సరఫరా విషయంలో మహారాష్ట్రకు మరింత సహకరిస్తామని చెప్పినట్లు తెలిపింది.

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్​కు సైతం మోదీ కాల్ చేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు చేపట్టిన చర్యల గురించి సీఎంను ఆరా తీశారు. వైరస్​ కట్టడికి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని మోదీ హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి విప్లబ్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా చికిత్స కోసం మరిన్ని కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

pm speaks to tripura cm over covid
ప్రారంభానికి సిద్ధమైన కొవిడ్ కేర్ సెంటర్​లో త్రిపుర సీఎం

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​తోనూ ప్రధాని ఫోన్​లో మాట్లాడారు.

టీకాలు ఇవ్వండి: కేజ్రీ

మరోవైపు, రాజధాని ప్రజలందరి కోసం వచ్చే మూడు నెలల్లో 2.6 కోట్ల టీకా డోసులను అందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. దిల్లీ ప్రజలందరికీ టీకా అందించాలంటే మూడు కోట్లకుపైగా టీకాలు అవసరమని, అందులో 40 లక్షల డోసులు ఇప్పుటికే తమకు అందాయని చెప్పారు. ఇకపై ప్రతి నెలా 85 లక్షల డోసులు సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం వంద కేంద్రాల్లో టీకా పంపిణీ కొనసాగుతోందని, దాన్ని 250-300 కేంద్రాలకు పెంచుతామని తెలిపారు. దిల్లీలో 5-6 రోజులకు సరిపడా టీకా నిల్వలు ఉన్నాయని చెప్పారు.

ఇదీ చదవండి: దిల్లీకి చేరిన అసోం రాజకీయం

Last Updated : May 8, 2021, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.