ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంజాబ్ పర్యటనలో తలెత్తిన భద్రతలో లోపంపై విచారణ చేస్తున్న కమిటీ ఛైర్మన్‌కు బెదిరింపులు వచ్చాయి. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఛైర్మన్ జస్టిస్ ఇందూ మల్హోత్రాను బెదిరిస్తూ ఆడియో విడుదలైంది. విచారణ చేయవద్దంటూ బెదిరిస్తూ... సిక్ ఫర్ జస్టిస్( ఎస్ఎఫ్జే) సంస్థ ఆడియోను విడుదల చేసింది.
ప్రధాని భద్రతా లోపం కేసుకు దూరంగా ఉండాలని కమిటీ ఛైర్మన్‌ను బెదిరించినట్లు ఆడియోలో ఉంది. గతంలోనూ పలువురు సుప్రీంకోర్టు జడ్జిలను ఎస్ఎఫ్జే సంస్థ బెదిరించింది.
ఈనెల 5న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కు ప్రధాని వెళ్తుండగా.. అడ్డగించిన ఘటనపై సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.
ఇదీ చదవండి: 'బలవంతమేమీ లేదు.. నచ్చితేనే టీకా తీసుకోవచ్చు'