ETV Bharat / bharat

టీకా వృథాను అరికట్టాలి: మోదీ - టీకా వృథాపై మోదీ

టీకాల ఉత్పత్తిని పెంచేలా వ్యాక్సిన్ ఉత్పత్తిదారులకు అన్ని రకాలుగా సాయం చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో టీకా పంపిణీ ప్రక్రియపై ప్రధాన మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. టీకా వృథా అరికట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

PM narendra modi
మోదీ
author img

By

Published : Jun 4, 2021, 9:49 PM IST

వ్యాక్సిన్​ ఉత్పత్తిదారులు మరిన్ని టీకా ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వారికి సహాయం చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆర్థికపరంగాను, ముడి పదార్థాల సరఫరాలోనూ వారికి అండగా ఉంటున్నట్లు చెప్పారు. దేశంలో టీకా పంపిణీపై మోదీ సమీక్షా సమావేశం అనంతరం ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) పేర్కొంది.

వివిధ రాష్ట్రాల్లో టీకా వృథా సంఖ్య అధికంగా ఉన్నందున.. దాన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మోదీ ఆదేశించారు. దేశంలో ఉన్న టీకా లభ్యత గురించి ఈ సమావేశంలో మోదీకి అధికారులు వివరించారు. టీకా ఉత్పత్తిని పెంచేందుకుగాను వివిధ వ్యాక్సిన్​ ఉత్పత్తి సంస్థలకు సహాయం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు.

దేశవ్యాప్తంగా టీకా పంపిణీ ప్రక్రియ ఎలా సాగుతోందో అధికారులను అడిగి మోదీ తెలుసుకున్నారు. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్​ గోయల్​, సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఇదీ చూడండి: 'దేశంలో 68శాతం కేసులు తగ్గాయ్​'​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.