నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లు ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు.
" జనవరి23ను 'పరాక్రమ దివస్'గా జరుపుకోవటమే నేతాజీకి నిజమైన నివాళి. ఆయన ధైర్యసాహసాలకు ప్రతీకగా పరాక్రమ దివస్ నిలుస్తుంది. నేతాజీ భారత ప్రజల్లో జాతీయతాభావాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు. నేతాజీ త్యాగం, దేశభక్తి చిరస్మరణీయం. "
--రామ్‌నాథ్ కోవింద్, భారత రాష్ట్రపతి
స్వాతంత్య్రం కోసం నేతాజీ చేసిన త్యాగం దేశ ప్రజలు ఎన్నటికీ మరువరని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
"నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళులు. భరతమాతకు నిజమైన ముద్దు బిడ్డ నేతాజీ."
--నరేంద్ర మోదీ, భారత ప్రధాని
'షా' నివాళి
-
#WATCH | "I hope we all participate in PM Modi's decision to celebrate 125th birth anniversary of Subhash Chandra Bose & especially educate children & youth about Netaji's life," Home Minister Amit Shah, in Guwahati#NetajiSubhashChandraBose pic.twitter.com/UuQPllkFLP
— ANI (@ANI) January 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | "I hope we all participate in PM Modi's decision to celebrate 125th birth anniversary of Subhash Chandra Bose & especially educate children & youth about Netaji's life," Home Minister Amit Shah, in Guwahati#NetajiSubhashChandraBose pic.twitter.com/UuQPllkFLP
— ANI (@ANI) January 23, 2021#WATCH | "I hope we all participate in PM Modi's decision to celebrate 125th birth anniversary of Subhash Chandra Bose & especially educate children & youth about Netaji's life," Home Minister Amit Shah, in Guwahati#NetajiSubhashChandraBose pic.twitter.com/UuQPllkFLP
— ANI (@ANI) January 23, 2021
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సైతం నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు అసోం గువాహటిలో నివాళులు అర్పించారు. నేతాజీ జీవితాన్ని విద్యార్థులకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు బోస్‌ను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు.
నేతాజీ స్ఫూర్తి, ఆయన నిస్వార్థ సేవకు గౌరవ సూచకంగా ఆయన జయంతి(జనవరి 23)ను 'పరాక్రమ దివస్'గా జరుపుకోవాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా శనివారం కోల్‌కతాలో జరిగే 'పరాక్రమ దివస్'వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు.
ఇదీ చదవండి : 'నేతాజీ.. భారతావని పరాక్రమ పతాక'