ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేసే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. గాంధీజీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.

అంతకుముందు, దేశప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. ఆజాదీ కా అమృత్ మహోత్సవం.. దేశ ప్రజల్లో నూతన ఉత్తేజం, చైతన్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు.
అమెరికా సందేశం...
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం భారత ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, అహింస మార్గాన్ని అనుసరించి, గాంధీ మార్గదర్శనంలో భారతదేశం స్వాతంత్ర్యం సాధించిందని గుర్తు చేశారు. వైవిధ్యంతో కూడిన రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు ప్రజలకోసం పాటుపడగలవనే సందేశాన్ని ప్రపంచానికి అందించాలని పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం బలపడిందని అన్నారు.
ఇదీ చదవండి: