ETV Bharat / bharat

''ఈ-రూపీ'తో ఇక మరింత పక్కాగా డిజిటల్ పేమెంట్స్!' - ఈ-రూపీ గురించి మోదీ

'ఈ-రూపీ' ఓచర్​ ద్వారా.. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత కనిపిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీలు సులభతరం చేసేందుకు తీసుకువచ్చిన 'ఈ-రూపీ' విధానాన్ని ఆయన సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.

pm narendra modi
పీఎం నరేంద్ర మోదీ
author img

By

Published : Aug 2, 2021, 4:53 PM IST

Updated : Aug 2, 2021, 5:21 PM IST

దేశంలో డిజిటల్‌ చెల్లింపులను మరింత సులభతరం చేసేలా.. 'ఈ-రూపీ' విధానాన్ని కేంద్రం తీసుకువచ్చింది. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. దేశంలో డిజిటల్​ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల అమలులో ఈ-రూపీ ఓచర్​.. కీలక పాత్ర పోషిస్తుందని మోదీ పేర్కొన్నారు.

modi launches e rupi system
'ఈ-రూపీ' విధానాన్ని ప్రారంభిస్తున్న మోదీ

"దేశంలో డిజిటల్​ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల్లో ఈ-రూపీ ఓచర్​ కీలక పాత్ర పోషిస్తుంది. దీని వల్ల పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వ వ్యవస్థల్లోనే కాకుండా.. ప్రైవేట్​ వ్యక్తులు, సంస్థలు ఈ-రూపీ విధానాన్ని వినియోగించవచ్చు. ఈ-రూపీ ఓచర్​ ప్రజలందరికీ ప్రయోజనాలను చేకూరుస్తుంది. 21వ శతాబ్దంలో.. ఆధునిక సాంకేతికత సాయంతో ప్రజలందరినీ అనుసంధానం చేస్తూ.. అభివృద్ధి పథంలో వెళ్తోందనేందుకు ఈ-రూపీ ఓ ఉదాహరణ. భారత్​ 75 ఏళ్ల స్వాతంత్య వేడుకలు జరుపుకోనున్న తరుణంలో ఈ విధానాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది.

-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

పేద ప్రజలకు సాయం చేసే ఉపకరణంలా సాంకేతికత ఉపయోగపడుతోందని మోదీ అన్నారు. సాంకేతికత వల్ల పారదర్శకత సాధ్యమవుతోందని చెప్పారు. ఎల్​పీజీ నుంచి రేషన్, పింఛన్ వరకు 300 పథకాల్లో ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ చేస్తోందని పేర్కొన్నారు.

నగదు రహిత లావాదేవీలకు ప్రోత్సాహం, మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ-రూపీ విధానాన్ని తీసుకొచ్చింది కేంద్రం. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేశారు.

ఈ-రూపీ అంటే..

ఈ వ్యవస్థలో ఒక క్యూఆర్‌ కోడ్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ స్ట్రింగ్‌ ఓచర్‌లను లబ్ధిదారుడి మొబైల్‌ ఫోన్‌కి పంపిస్తారు. వీటినే ఈ-రుపీగా భావించవచ్చు. అందులో నిర్దేశిత డబ్బును ముందే లోడ్‌ చేసి పెడతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రీపెయిడ్‌ గిఫ్ట్‌ ఓచర్ల లాంటివే. ఈ ఓచర్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట అంటే సంబంధిత సేవలు అందేచోట వినియోగించుకోవచ్చు. దీనికి బ్యాంకు, యాప్‌, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌.. వంటి మధ్యవర్తిత్వ వేదికలేవీ అవసరం లేదు.

ఇదీ చూడండి: 'మీ ఆలోచనలు.. ఎర్రకోట నుంచి ప్రతిధ్వనిస్తాయి'

ఇదీ చూడండి: Modi: ట్విట్టర్​లో మోదీకి మరింత పెరిగిన ఫాలోయింగ్​

Last Updated : Aug 2, 2021, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.