ETV Bharat / bharat

'క్విట్ 'ఇండియా'.. అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజల నినాదమిదే'

author img

By

Published : Aug 7, 2023, 3:06 PM IST

PM Narendra Modi At National Handloom Day 2023 : క్విట్ ఇండియా స్ఫూర్తిగా ప్రస్తుతం దేశ ప్రజలంతా అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ప్రగతి మైదాన్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు.

national handloom day 2023
national handloom day 2023

PM Modi At National Handloom Day 2023 : భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను కొందరు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. క్విట్ ఇండియా స్ఫూర్తిగా ప్రస్తుతం దేశ ప్రజలంతా అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని చెప్పారు. విపక్ష కూటమి 'ఇండియా'ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ప్రగతి మైదాన్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. గత 9 ఏళ్లలో ఖాదీ ఉత్పత్తి 3 రెట్లు, ఖాదీ వస్త్రాల ఉత్పత్తి 5 రెట్లు పెరిగిందన్నారు. విదేశాల్లో సైతం మన ఖాదీ వస్త్రాల వినియోగం పెరిగిందని చెప్పారు. స్వాతంత్ర్యం అనంతరం చేనేత పరిశ్రమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. 2014లో రూ. 25 వేల కోట్లు ఉన్న ఖాదీ ఉత్పత్తుల విక్రయాలు.. ప్రస్తుతం రూ.1.30 కోట్లకు చేరిందని గుర్తు చేశారు.

  • #WATCH | Delhi: " In the past 9 years, Khadi production has increased by 3 times and sales of Khadi clothes also increased by 5 times. Demand for Khadi clothes increasing in foreign countries...": PM Modi pic.twitter.com/AltMPGOcyB

    — ANI (@ANI) August 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

National Handloom Day 2023 In Telugu : గుజరాత్​లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద ప్రారంభించిన ఎక్తా మాల్స్​ను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రధాన మోదీ వెల్లడించారు. వీటితో పాటు టెక్స్​టైల్​ సంస్థలకు అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. చేనేత, ఫ్యాషన్​ రంగాలు తమ పరిధిని విస్తరించుకొని.. భారత్​ను మూడో ఆర్థిక శక్తిగా మార్చేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. నేత కార్మికులకు సబ్సిడీ ధరలకే దారాలు ఇస్తున్నామని.. కొత్త డిజైన్లు రూపొందించడానికి అధునాతన సాంకేతికతను సైతం అందిస్తున్నట్లు చెప్పారు. చేనేత వస్తువుల మార్కెటింగ్​ విషయంలో ఏర్పడే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

#WATCH | Delhi: Prime Minister Narendra Modi participates in the National Handloom Day celebration at Bharat Mandapam, Pragati Maidan pic.twitter.com/ZufDx4i35I

— ANI (@ANI) August 7, 2023

'కాంగ్రెస్​కు అర్థం కావడానికి నాలుగు దశబ్దాలు పట్టింది'
అంతకుముందు బీజేపీ వీడియో కాన్ఫరెన్స్​ను ప్రారంభించిన ప్రధానమంత్రి మోదీ.. సమావేశంలో వర్చువల్​గా మాట్లాడారు. గ్రామాల్లో పంచాయతీరాజ్‌ వ్యవస్థను అమలు చేయడం ఎంత ముఖ్యమో కాంగ్రెస్‌ పార్టీ తెలుసుకో లేకపోయిందని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాలుగు దశాబ్దాల్లో కాంగ్రెస్‌కు ఈ విషయం అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ హయాంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలోపేతానికి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని ఆరోపించారు. జిల్లా పంచాయతీ వ్యవస్థను కూడా పట్టించుకోకుండా గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. ప్రస్తుతం భారత్‌ లక్ష్యాలను, 'అమృత్‌ కాల్‌' తీర్మానాలను నెరవేర్చడానికి దేశం ఐక్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ అమృత్‌కాల్‌లోని 25 ఏళ్ల ప్రయాణంలో గత దశబ్దాల అనుభవాలను గుర్తుచేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

  • "As a representative of BJP, you have to take the benefits of the Panchayati Raj system to the last person standing in the last line of society. I would request all of you that you should go and stay at some small place in your area for 2 nights a week and sit with the people… pic.twitter.com/ZNkQKUbWC1

    — ANI (@ANI) August 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'పెద్ద నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం మాదే! అందుకే ప్రపంచంలో దేశ ఖ్యాతి పెరిగింది'

నూతన విద్యా విధానానికి మూడేళ్లు.. స్కూల్​ను సందర్శించిన ప్రధాని... చిన్నారులతో సరదా సంభాషణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.