ETV Bharat / bharat

'నూతన విద్యావిధానం ఆత్మనిర్భర్ భారత్​లో కీలకం' - vishwabharathi university convocation

నూతన విద్యావిధానం ఆత్మనిర్భర్ భారత్​లో కీలకమైన ముందడుగని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బంగాల్ బీర్‌భూమ్ జిల్లాలోని విశ్వభారతి వర్సిటీ స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

PM Narendra address the convocation of Visva-Bharati University
'నూతన విద్యావిధానం ఆత్మనిర్భర్ భారత్​లో కీలకం'
author img

By

Published : Feb 19, 2021, 12:18 PM IST

Updated : Feb 19, 2021, 1:17 PM IST

నూతన విద్యావిధానం.. ఆత్మనిర్భర్ భారత్​లో కీలకమైన ముందడుగని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. బంగాల్ బీర్‌భూమ్ జిల్లాలోని విశ్వభారతి వర్సిటీ స్నాతకోత్సవంలో వర్చువల్​ ద్వారా ఆయన పాల్గొన్నారు. ఈ విద్యావిధానం వల్ల.. విద్యార్థులను పరిశోధన, సృజనాత్మకతవైపు నడిపించేందుకు బలాన్ని చేకూర్చిందన్నారు.

ఈ నేపథ్యంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు మోదీ.

ఓ వైపు అనేకమంది విద్యావంతులు.. ప్రపంచవ్యాప్తంగా హింస, ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంటే.. మరోవైపు ప్రజలను కరోనా నుంచి కాపాడేందుకు కొంతమంది వారి జీవితాలనే పణంగా పెడుతున్నారు. సమస్యను సృష్టించే వైపునకు వెళ్లాలో.. లేక సమస్యను పరిష్కరించే మార్గాన్ని ఎంచుకోవాలో.. విద్యార్థులు చేతిలోనే ఉంది. విజ్ఞానం, నైపుణ్యం.. విద్యార్థులను సమాజంలో తలెత్తుకునేలా చేస్తాయి. కానీ వాటిని చెడుకు వాడితే.. విద్యార్థులను చీకట్లోకి నెట్టేస్తాయి. జయాపజయాలు మన భవిష్యత్​ను నిర్దేశించవు. మీ ఉద్దేశం సరైనదైతే పరిష్కారం ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడానికి భయపడొద్దు.

-- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో..

రైతులకు, చేతివృత్తి కళాకారులు ప్రపంచ మార్కెట్లలో రాణించేందుకు.. వారికి సహకరించాలని విశ్వభారతి విద్యాలయం విద్యార్థులకు ప్రధాని సూచించారు. ఇది ఆత్మనిర్భర్ భారత్​ను నిర్మించటంలో కీలకమన్నారు. ఈ వర్సిటీ కేవలం విద్యారంగానికే పరిమితం కావద్దని రవీంద్రనాధ్​ ఠాగూర్​ భావించారని.. భారత సంస్కృతిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారని పేర్కొన్నారు. విజ్ఞానం ఎప్పుడూ తటస్థంగా ఉండదని.. మారుతూ ఉంటుందని తెలిపారు. కర్తవ్యంతో కూడిన విజ్ఞానం.. భావితరాలకు ఉపయోగపడుతుందన్నారు.

విశ్వభారతి వర్సిటీ ఛాన్స్​లర్‌గా వ్యవహరిస్తున్నారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంలో 2,535 మంది విద్యార్థులు డిగ్రీలు తీసుకున్నారు.

ఇదీ చదవండి : ఆ విషయంలో మోదీకి జై కొట్టిన పాకిస్థాన్​

Last Updated : Feb 19, 2021, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.