ETV Bharat / bharat

ఆ మార్గంలో నిలిచిపోయిన ప్రధాని మోదీ కాన్వాయ్‌.. ఏమైందంటే? - ఓ అంబులెన్స్‌ దారిఇచ్చిన ప్రధాని కాన్వాయ్‌

ఎన్నికల కోసం హిమాచల్‌ ప్రదేశ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్​ను రోడ్డుపై నిలిపివేశారు. ఏమైదంటే?

PM Modi
ప్రధాని నరేంద్ర మోదీ
author img

By

Published : Nov 10, 2022, 8:03 AM IST

హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం నరేంద్ర మోదీ రోడ్డు మార్గంలో వెళ్తున్న సమయంలో ఓ అంబులెన్స్‌ వచ్చింది. దీంతో ప్రధాని తన కాన్వాయ్‌ని నిలిపివేశారు. ఆ అంబులెన్స్‌ వెళ్లిన తర్వాత ప్రధాని వాహన శ్రేణి ముందుకు కదిలింది.

వాహనంలో కూర్చున్న మోదీ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను భాజపా తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌లో అంబులెన్స్‌కు దారిచ్చేందుకు ప్రధాని తన కాన్వాయ్‌ను నిలిపివేశారని.. విలువైన ప్రాణాల్ని కాపాడేందుకు ఎల్లప్పుడూ అంబులెన్స్‌కు దారి ఇవ్వండి అని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

ఇటీవల గుజరాత్‌ పర్యటనలోనూ ఇలాంటి సన్నివేశమే చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌ నుంచి గాంధీనగర్‌కు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తోన్న సమయంలో ఓ అంబులెన్స్‌ రావడంతో ప్రధాని తన కాన్వాయ్‌ను రోడ్డు పక్కకు నిలిపివేసిన విషయం తెలిసిందే.

ఇంకోవైపు, హిమాచల్‌ప్రదేశ్‌లో శనివారం పోలింగ్‌ జరగనున్న వేళ అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న కాంగ్డా జిల్లాలో ప్రధాని మోదీ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సుజన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కేంద్రంలో గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు హిమాచల్‌ప్రదేశ్‌కు ద్రోహం చేసిందని, ఆ పార్టీ అభివృద్ధి వ్యతిరేక పార్టీ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే రాష్ట్ర ప్రగతి కుంటుపడుతుందని.. ఆ పార్టీతో రాజకీయ అస్థిరత, అవినీతి, కుంభకోణాలేనని ఆరోపించారు. భాజపాను మరోసారి గెలిపించి డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించి ప్రజలు చరిత్ర తిరగరాయాలని విజ్ఞప్తి చేశారు.

  • यूं ही नहीं प्रधानसेवक कहलाते...

    हिमाचल में एंबुलेंस को रास्ता देने के लिए रुकवाया अपना काफिला।

    बहुमूल्य जीवन की रक्षा के लिए आप भी हमेशा एंबुलेंस को रास्ता दें! pic.twitter.com/8VjPoQIPSZ

    — BJP (@BJP4India) November 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: నకిలీ బ్యాంక్​తో భారీ స్కామ్.. 10 బ్రాంచ్​లు నడుపుతూ కోట్లు మోసం.. చివరకు..

నోట్ల రద్దుపై అఫిడవిట్ ఆలస్యం.. అవమానం అంటూ కేంద్రంపై సుప్రీం ఫైర్.. వారం డెడ్​లైన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.