ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకానికి సంబంధించి 8వ విడత కింద నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం గురువారం వెల్లడించింది.
ఈ ఎనిమిదో విడత ద్వారా లబ్ధిదారులైన 9.5 కోట్ల మంది కర్షక కుటుంబాలకు రూ.19000 కోట్లు లబ్ధి చేకూరుతుందని ప్రధాని మంత్రి కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఈ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేస్తామని.. ఇప్పటివరకు రూ.1.15 లక్షల కోట్లను రైతు కుటుంబాలకు అందించామని తెలిపింది.
ఈ పథకం కింద కేంద్రం.. ఏటా రైతు కుటుంబాలకు రూ.6000ను.. మూడు విడతల్లో రూ.2000 చొప్పున అందిస్తోంది.
ఇదీ చదవండి : తల్లి, సోదరుడి మృతదేహాలతో 3 రోజులుగా ఇంట్లోనే మహిళ!