PM Modi Visits ISRO : చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ నిర్వహించి ఇస్రో అసాధారణ విజయం సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇస్రో సాధించిన విజయం పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు. చంద్రయాన్-3 ద్వారా అంతరిక్షంలో భారత్ సరికొత్త చరిత్రను సృష్టించిందని చెప్పారు. బెంగళూరులోని ఇస్రో కార్యాలయాన్ని ( Modi Meets ISRO Scientists ) సందర్శించిన మోదీ.. శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు.
"ప్రయోగం సమయంలో నేను దక్షిణాఫ్రికాలో ఉన్నా. కానీ నా మనసంతా చంద్రయాన్-3 విజయంపైనే ఉంది. అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్రను భారత్ సృష్టించింది. ఇప్పుడు భారత్ చంద్రుడిపై ఉంది. భారత్ సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాం. గతంలో ఎవరూ చేయలేనిది ఇప్పుడు ఇస్రో చేసింది. ప్రపంచంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపగలమని నిరూపించాం. ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నా."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల పర్యటనను ముగించుకొని బెంగళూరు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా ఇస్రో కార్యాలయానికే వెళ్లారు. చంద్రయాన్-3 ప్రాజెక్టును విజయవంతం చేసిన శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ & కమాండ్ నెట్వర్క్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ (TTCNMCC) కార్యాలయానికి రోడ్‌షోగా వెళ్లిన ఆయనకు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్, ఇతర శాస్త్రవేత్తలు స్వాగతం పలికారు. అనంతరం మోదీకి చంద్రయాన్-3 గురించి వివరాలు తెలియజేశారు. ల్యాండర్, రోవర్ ఎలా పనిచేస్తాయనే విషయాలను మోదీకి.. సోమనాథ్ వివరించారు. శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాలను ప్రధాని ఆసక్తిగా విన్నారు. వారిని పలు ప్రశ్నలు అడిగి అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్-3 ల్యాండర్ తీసిన తొలి ఫొటోను మోదీకి బహూకరించారు సోమనాథ్.
-
#WATCH | Bengaluru: Prime Minister Narendra Modi meets ISRO chief S Somanath and congratulates him for the successful landing of Chandrayaan-3 on the Moon pic.twitter.com/J8cRsftwv2
— ANI (@ANI) August 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Bengaluru: Prime Minister Narendra Modi meets ISRO chief S Somanath and congratulates him for the successful landing of Chandrayaan-3 on the Moon pic.twitter.com/J8cRsftwv2
— ANI (@ANI) August 26, 2023#WATCH | Bengaluru: Prime Minister Narendra Modi meets ISRO chief S Somanath and congratulates him for the successful landing of Chandrayaan-3 on the Moon pic.twitter.com/J8cRsftwv2
— ANI (@ANI) August 26, 2023
-
#WATCH | Prime Minister Narendra Modi at ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru pic.twitter.com/IO3YxuV4JE
— ANI (@ANI) August 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Prime Minister Narendra Modi at ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru pic.twitter.com/IO3YxuV4JE
— ANI (@ANI) August 26, 2023#WATCH | Prime Minister Narendra Modi at ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru pic.twitter.com/IO3YxuV4JE
— ANI (@ANI) August 26, 2023
అంతకుముందు బెంగళూరు హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన మోదీకి స్థానికులు భారీగా స్వాగతం పలికారు. వారిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. భారతీయులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సైన్స్‌ను విశ్వసించే ప్రతిఒక్కరూ చంద్రయాన్-3 విజయంతో ముగ్ధులయ్యారని అన్నారు. చంద్రయాన్-3 విజయంతో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతిఒక్కరినీ గర్వపడేలా చేశారని తెలిపారు. తాను విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ.. వారిని కలవకుండా ఉండలేకపోయానని చెప్పుకొచ్చారు. అందుకే భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత మొదట శాస్త్రవేత్తల వద్దకే వెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టుకు వచ్చినవారితో 'జై జవాన్- జై కిసాన్, జై విజ్ఞాన్- జై అనుసంధాన్' నినాదాలు చేయించారు.
-
#WATCH | Karnataka | Prime Minister Narendra Modi greets people on his way to ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru where he will meet scientists of the ISRO team involved in the #Chandrayaan3 Mission. pic.twitter.com/JUust0rtry
— ANI (@ANI) August 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Karnataka | Prime Minister Narendra Modi greets people on his way to ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru where he will meet scientists of the ISRO team involved in the #Chandrayaan3 Mission. pic.twitter.com/JUust0rtry
— ANI (@ANI) August 26, 2023#WATCH | Karnataka | Prime Minister Narendra Modi greets people on his way to ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru where he will meet scientists of the ISRO team involved in the #Chandrayaan3 Mission. pic.twitter.com/JUust0rtry
— ANI (@ANI) August 26, 2023
'నేనే రావొద్దన్నా'
తనను ఆహ్వానించేందుకు రావొద్దని కర్ణాటక గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు తాను విజ్ఞప్తి చేసినట్లు మోదీ చెప్పారు. సుదీర్ఘ ప్రయాణం కాబట్టి.. విమానం ఎప్పుడు ల్యాండ్ అవుతుందో స్పష్టంగా తెలియని నేపథ్యంలో వారిని రావద్దని సూచించానని తెలిపారు. ఇందుకు సహకరించారని చెప్పిన మోదీ.. వారికి కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, ప్రధాని పర్యటనకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్.. ఇదే విషయంపై ట్వీట్ చేశారు. సిద్ధరామయ్య, శివకుమార్లను కావాలనే ఎయిర్‌పోర్ట్‌కు రాకుండా మోదీ అడ్డుకుంటున్నారని విమర్శించారు. మోదీ కంటే ముందే ఇస్రో శాస్త్రవేత్తలను సిద్ధరామయ్య, శివకుమార్ సత్కరించారని గుర్తు చేశారు. అందుకే మోదీ వారిని రానీయకుండా చేశారని మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని చిల్లర రాజకీయంగా అభివర్ణించారు జైరాం రమేశ్.
Chandrayaan 3 Pragyan Rover : 8 మీటర్లు ప్రయాణించిన ప్రగ్యాన్ రోవర్.. అంతా సవ్యంగానే..
Chandrayaan 3 Pragyan Rover Landing : చంద్రుడిపై భారత సంతకం! 'ప్రగ్యాన్' ల్యాండింగ్ వీడియో చూశారా?