ETV Bharat / bharat

ప్రధాని.. పోర్చుగల్, ఫ్రాన్స్​ పర్యటనలు రద్దు! - కొవిడ్ కేసులు

కొవిడ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. పోర్చుగల్, ఫ్రాన్స్​ పర్యటనలపై అనిశ్చితి నెలకొంది. భారత్​లో వైరస్​ పరిస్థితిపై ఆయన వరుస భేటీలు నిర్వహిస్తున్న వేళ పర్యటనలు రద్దు కానున్నట్లు సమాచారం.

PM Modi unlikely to visit Portugal, France
ప్రధాని పోర్చుగల్, ఫ్రాన్స్​ పర్యటనలు రద్దు!
author img

By

Published : Apr 20, 2021, 10:00 AM IST

కరోనా రెండో దశ ఉద్ధృతి భీకరంగా మారిన వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై నీలినీడలు కమ్ముకున్నాయి. భారత్-ఈయూ సదస్సు కోసం మే 8న ప్రధాని పోర్చుగల్ వెళ్లాల్సిఉంది. అనంతరం ద్వైపాక్షిక చర్చల కోసం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మేక్రాన్​తో భేటీ అయ్యేందుకు.. ఫ్రాన్స్​లో పర్యటించాల్సి ఉంది. అయితే ఈ రెండు పర్యటనలు జరిగే అవకాశం లేదని విశ్వసనీయవర్గాల సమాచారం.

మోదీ పర్యటనలపై విదేశాంగ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దేశంలో కరోనా పరిస్థితిపై సమీక్షించేందుకు సంబంధిత శాఖలతో మోదీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్​-ఈయూ సదస్సులో ప్రధాని వర్చువల్​గా పాల్గొనే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: 'కరోనా కట్టడిలో టీకాయే శక్తిమంతమైన ఆయుధం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.