ETV Bharat / bharat

'ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నా' - మోదీ పుట్టిన రోజు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi ji Birthday) పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు ప్రపంచ దేశాధినేతలు మోదీకి బర్త్​డే విషెస్ చెప్పారు. ఈ సందర్బంగా మాట్లాడిన మోదీ (Modi Birthday Wishes).. తన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నట్లు తెలిపారు.

modi
మోదీ
author img

By

Published : Sep 17, 2021, 11:21 PM IST

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులకు, ప్రపంచ దేశాల నేతలకు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ (Modi ji Birthday). శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష, నేపాల్ ప్రధాని షేర్​ బహదూర్ దేవ్​బాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

71వ పుట్టిన రోజు జరుపుకున్న మోదీకి(Modi Birthday Wishes) దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. దేశం కోసం మరింత దృఢసంకల్పంతో పనిచేసేలా అందరూ ఆశీర్వదించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నానని అన్నారు.

  • I am humbled and overwhelmed beyond words.

    To each and every person who has wished me today - I would like to express gratitude from the bottom of my heart.

    I cherish every wish and it gives me strength to work even harder for our beloved nation.

    — Narendra Modi (@narendramodi) September 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మన బంధం ఇంకా కొనసాగుతుంది. ఇంకా దేశానికి చేయాల్సింది చాలా ఉంది. భారతావనిని దృఢమైన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం నెరవేరేవరకు మనం ఆగిపోకూడదు. ఈ దేశం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. జైహింద్."

--నరేంద్ర మోదీ, ప్రధాని.

దేశవ్యాప్తంగా నేడు రికార్డు స్థాయిలో టీకాలు(Vaccination Record India) ఇవ్వడం ఆనందంగా ఉందని చెబుతూ మోదీ(Modi Ji) పలు ట్వీట్లు చేశారు. డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది విశేష కృషిని కొనియాడారు. కొవిడ్​ కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్​ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని అన్నారు.

సేవా ఔర్ సమర్పన్..

ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. 'సేవా ఔర్ సమర్పన్' (Seva Aur Samarpan) కార్యక్రమాన్ని ప్రారంభించారు. 20 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 7 వరకు ఇది కొనసాగుతుందని తెలిపారు.

దలైలామా విషెస్..

ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు దలైలామా. కొవిడ్​-19 సమయంలోనూ దేశ ప్రజల్లో మోదీ స్ఫూర్తిని నింపారని అన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు.

ఇదీ చదవండి:

వ్యాక్సినేషన్​లో మళ్లీ రికార్డ్​.. టీకా పంపిణీ@2కోట్లు

Modi birthday: 'మోదీ అంకితభావంతో.. అభివృద్ధిలో దూసుకెళ్తున్న భారత్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.