ETV Bharat / bharat

తొలి డ్రైవర్​ రహిత మెట్రో రైలుకు నేడు మోదీ శ్రీకారం - bharat news today

భారత్​లోనే తొలి ​డ్రైవర్​ రహిత రైలు​ను.. ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దీంతో పాటు నేషనల్​ కామన్​ మొబిలిటీ కార్డు(ఎన్​సీఎంసీ)ను ప్రారంభిస్తారు ప్రధాని.

author img

By

Published : Dec 28, 2020, 5:29 AM IST

Updated : Dec 28, 2020, 5:46 AM IST

దేశంలోనే మొట్టమొదటి డ్రైవర్‌ లేని రైలును ప్రధాని నరేంద్ర మోదీ.. ఇవాళ దిల్లీ మెట్రోలో ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ చోదకరహిత రైలును.. మాజెంటా లైన్‌లో జనక్‌పురి నుంచి బొటానికల్ గార్డెన్‌ వరకూ 37 కిలోమీటర్ల మేర నడపనున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మజ్లిస్‌ పార్క్‌ నుంచి శివ్‌ విహార్‌ మధ్య 57 కిలోమీటర్లు పొడవునా డ్రైవర్‌ లేని మెట్రో సేవలు మొదలవుతాయని దిల్లీ మెట్రో వెల‌్లడించింది.

ఎన్​సీఎంసీ కూడా..

దీంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో పనిచేసే నేషనల్​ కామన్​ మొబిలిటీ కార్డు(ఎన్​సీఎంసీ)ను ప్రారంభిస్తారు మోదీ. ఎయిర్​పోర్ట్​ ఎక్స్​ప్రెస్​ లైన్​లో భాగంగా న్యూ దిల్లీ నుంచి ద్వారకా సెక్టార్ ​21 వరకు ఉన్న 23 కి.మీ.ల వరకు ఇది పనిచేస్తుంది.

దిల్లీ మెట్రోలోని పది కారిడార్లలో ఎన్​సీఎంసీ మొదటిసారిగా వినియోగంలోకి రానుంది. 'వన్​ నేషన్​-వన్​ కార్డ్' నినాదంలో భాగంగా దీనిని 2019 మార్చిలో మోదీ ప్రారంభించారు.

కొత్త శకం ఆరంభం..

కొత్తతరం రైళ్లను ప్రారంభించటం ద్వారా దిల్లీ మెట్రో.. 7 శాతం ప్రపంచ మెట్రో నెట్‌వర్క్‌లో చేరనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నూతన ఆవిష్కరణల ద్వారా.. దిల్లీ ప్రజలకు, దేశ రాజధాని ప్రాంతంలోని ఇతర నగర వాసులకు ప్రయాణ సదుపాయాలు, విస్తరణకు సంబంధించి కొత్త శకం ఆరంభం కానుందని దిల్లీ మెట్రో ప్రకటించింది.

ఇదీ చూడండి: 'వచ్చే ఏడాది సరికొత్త శిఖరాలను అధిరోహిస్తాం'

Last Updated : Dec 28, 2020, 5:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.