స్వీడన్ ప్రధాని స్టీఫన్ లోఫ్వెన్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వర్చువల్గా సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు.
మోదీతో సమావేశం కోసం అత్రుతగా ఎదురుచూస్తున్నట్లు స్వీడన్ ప్రధాని ట్వీట్ చేశారు. కరోనాపై పోరులో పరస్పర సహకారం, మహమ్మారి అంతం తర్వాత సుస్థిర, సమానత్వ సమాజం వంటి అంశాలపై మోదీతో మాట్లాడతానని చెప్పారు.
సెరావీక్ పురస్కారం..
సెరావీక్ ప్రపంచ శక్తి, పర్యావరణ నాయకత్వ అవార్డును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ స్వీకరించనున్నారు. అమెరికాలో వర్చువల్గా జరుగుతున్న సెరావీక్-2021 వార్షిక సదస్సులో ఈ అవార్డును అందుకోనున్నారు. అనంతరం మోదీ ప్రసంగించనున్నారు.
మోదీకి సెరావీక్ ప్రపంచ శక్తి, పర్యావరణ నాయకత్వ అవార్డును గతవారమే ప్రకటించారు నిర్వాహకులు.