ETV Bharat / bharat

'వారిది మాఫియావాదం.. మాది అభివృద్ధి నినాదం' - పూర్వాంచల్ ఎక్స్​ప్రెస్​ వే

ఉత్తర్​ప్రదేశ్​ సుల్తాన్​పుర్​ జిల్లా పూర్వాంచల్​ ఎక్స్​ప్రెస్​ వేను (Purvanchal Expressway) ప్రారంభించారు మోదీ. ఈ క్రమంలో గత పాలకులపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఓ భాగాన్ని మాఫియాకు రాసిచ్చేశారని (PM Modi news) విమర్శించారు. దిల్లీతో పాటు లఖ్​నవూలోనూ (PM Modi UP visit) కొన్ని కుటుంబాలే ఆధిపత్యం చెలాయించాయని అన్నారు.

pm modi speech
మోదీ
author img

By

Published : Nov 16, 2021, 2:40 PM IST

Updated : Nov 16, 2021, 4:36 PM IST

యూపీలో ప్రధాని నరేంద్ర మోదీ

గత పాలకులు ఉత్తర్​ప్రదేశ్​ అభివృద్ధిని పట్టించుకోలేదని, రాష్ట్రంలోని ఓ ప్రాంతాన్ని, అక్కడి ప్రజలను మాఫియాకు రాసిచ్చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi news) దుయ్యబట్టారు. అయితే తమ పాలనలో రాష్ట్రాభివృద్ధిలో కొత్త శకం మొదలైందన్నారు. ఇందుకు చాలా సంతోషిస్తున్నట్టు చెప్పారు. సుల్తాన్​పుర్​ జిల్లాలో పూర్వాంచల్​ ఎక్స్​ప్రెస్​ వేను (Purvanchal Expressway) మంగళవారం ప్రారంభించారు మోదీ. ఉత్తర్​ప్రదేశ్​ శక్తిసామర్థ్యాలను సందేహించే వారు.. సుల్తాన్​పుర్​కు (PM Modi UP visit) వచ్చి ఇక్కడి పరిస్థితులను చూడాలని సూచించారు.

pm modi speech
వేదికపై మోదీ, యోగీ ఆదిత్యనాథ్

ఇదివరకు.. దిల్లీ(కేంద్రం)తో పాటు లఖ్​నవూ(యూపీ)లోనూ కుటుంబ పాలనలే కొనసాగాయని మోదీ విమర్శించారు. యూపీ ప్రజల ఆకాంక్షలను గతపాలకులు, కుటుంబాలు అణచివేశాయని అన్నారు. వారంతా తమ స్వప్రయోజనాల కోసం అభివృద్ధి విషయంలో వివక్ష చూపించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

pm modi speech
పూర్వాంచల్ ఎక్స్​ప్రెస్​ వే శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మోదీ

"ఈరోజు నేను ఇక్కడ విమానంలో దిగాను. మూడేళ్ల ముందు.. పూర్వాంచల్​ ఎక్స్​ప్రెస్​ వేకు శంకుస్థాపన చేసిన నాడు.. ఇలా విమానంలో నుంచి దిగుతానని అనుకోలేదు. కానీ అది సాధ్యమైంది. ఉత్తర్​ప్రదేశ్, రాష్ట్ర ప్రజల​ శక్తిసామర్థ్యాలను సందేహించే వారు ఓసారి ఇక్కడి వచ్చి వీటిని చూడాలి. మూడేళ్ల ముందు ఇక్కడ ఏం లేవు. గత పాలకులు తమ నివాసాలు ఉన్న ప్రాంతాల్లోనే అభివృద్ధి చేసుకున్నారు. అప్పటి కరెంటు కోతలు, శాంతిభద్రతల గురించి ఎవరు మర్చిపోగలరు? కానీ, ఆ ప్రభుత్వాలను మీరు గద్దె దించారు. ఇప్పుడు అత్యాధునిక ఎక్స్​ప్రెస్​వేను అందుబాటులోకి వచ్చింది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్ల కలిగే లాభాలివి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

యుద్ధవిమానంలో విచ్చేసి...

రహదారి ఆవిష్కరణ కోసం సుల్తాన్​పుర్​కు (Modi Purvanchal Expressway) యుద్ధవిమానంలో వచ్చారు మోదీ. సీ130జే సూపర్ హెర్కులస్ (C130j super hercules India) విమానంలో పూర్వాంచల్ ఎక్స్​ప్రెస్ వేపై దిగారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. మోదీకి సాదరంగా స్వాగతం పలికారు.అనంతరం సభావేదిక వద్దకు తీసుకెళ్లారు.

ఎమర్జెన్సీ ల్యాండింగ్​..

లఖ్​నవూను యూపీలోని తూర్పున ఉండే ప్రాంతాలను కలుపుతూ 340.8 కిలోమీటర్ల మేర ఈ రహదారిని (Purvanchal Expressway route) నిర్మించారు. ఆరు లేన్ల ఈ ఎక్స్​ప్రెస్ వే(Purvanchal Expressway route map 2021).. బారాబంకి, అమేఠీ, సుల్తాన్​పుర్, అయోధ్య, అంబేడ్కర్ నగర్, ఆజంగఢ్, మౌ, గాజీపుర్ జిల్లాలను (Purvanchal Expressway map) కలుపుతుంది. రహదారిలో భాగంగా సుల్తాన్​పుర్ వద్ద 3.2 కిలోమీటర్ల ఎయిర్​స్ట్రిప్ సిద్ధం చేశారు. అత్యవసర సమయంలో యుద్ధ విమానాలు దిగేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్​స్ట్రిప్​పైనే మోదీ యుద్ధ విమానంలో దిగారు.

pm modi speech
ఉత్తర్​ప్రదేశ్​ను ఎక్స్​ప్రెస్​ ప్రదేశ్​గా పేర్కొంటూ ఫొటో విడుదల చేసిన ప్రభుత్వం

వాహనదారులకు ప్రయోజనం కలిగేలా, ఇంధన వాడకం తగ్గేలా ఈ రహదారిని నిర్మించారు. భవిష్యత్​లో దీన్ని ఎనిమిది వరుసల రహదారిగా మార్చుకోవచ్చు. రూ.22,500 కోట్ల వ్యయంతో రహదారిని పూర్తి చేశారు.

ఇదీ చదవండి:

Last Updated : Nov 16, 2021, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.