ETV Bharat / bharat

'రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు' ప్రకటించిన ప్రధాని - ములుగు జిల్లాలో ట్రైబల్​ యూనివర్సిటీ ఏర్పాటు

PM Modi Announced Turmeric Board and Tribal University : ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రంపై వరాల జల్లు కురిపించారు. దశాబ్దాలుగా రైతుల చిరకాల వాంఛ నెరవేర్చుతూ.. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని ప్రకటించారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేసిన ఆయన.. ములుగు జిల్లాలో రూ.900 కోట్లతో ఏర్పాటుచేసే ఈ వర్సిటీకి సమ్మక్క-సారక్క పేరు పెడుతున్నట్లు వివరించారు. అదే వేదికపై నుంచి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మోదీ.. తెలంగాణకు బీజేపీ సర్కార్‌ చేయూతనిస్తుందని భరోసా ఇచ్చారు.

BJP Palamuru Praja Garjana Public Meeting
PM Modi Telangana Tour
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2023, 4:25 PM IST

Updated : Oct 1, 2023, 8:49 PM IST

PM Modi Announced Turmeric Board and Tribal University రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం పసుపు బోర్డు ప్రకటించిన ప్రధాని

PM Modi Announced Turmeric Board and Tribal University in Telangana : పాలమూరు జిల్లా పర్యటనలోప్రధాని నరేంద్ర మోదీ 13,500 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం తెలంగాణకు మోదీ వరాలు ప్రకటించారు. జాతీయ పసుపుబోర్డు, ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నా కుటుంబసభ్యుల్లారా.. అంటూ తెలుగులో మాట్లాడిన ప్రధాని.. దేశంలో పండగల సీజన్‌ మొదలైందన్నారు.

Kajipet Wagon Factory : కాజీపేట రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమ ఎలా ఉంటుందంటే..

PM Modi Speech in Mahabubnagar District : రాష్ట్రంలో ఎన్నో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టామని ప్రధాని మోదీ (Narendra Modi) వివరించారు. జాతీయ రహదారుల నిర్మాణంతో అన్ని రాష్ట్రాలతో తెలంగాణకు అనుసంధానం పెరిగిందన్నారు. దేశంలో నిర్మించే 5 టెక్స్‌ట్రైల్‌ పార్కుల్లో హనుమకొండలో ఒకటి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర పసుపు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ హామీ ఇచ్చారు.

"కరోనా మహమ్మారి తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచం మొత్తానికి తెలిసింది. అందుకే పసుపు డిమాండ్‌ బాగా భారీగా పెరిగింది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ నుంచి ఓ పెద్ద నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాం. పసుపు రైతులకు మేలు జరిగేలా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. జాతీయ పసుపు బోర్డు ద్వారా పంట ఉత్పత్తులను ప్రాసెసింగ్‌ చేసి ప్రజలకు అందించేలా మౌలిక వసతులు కల్పిస్తాం. బోర్డు ఏర్పాటుతో రాష్ట్ర పసుపు రైతులతోపాటు దేశంలోని అన్నదాతలందరికీ ఎంతో ప్రయోజనం చేకూరుతుంది." - నరేంద్ర మోదీ, ప్రధాని

PM Modi Announced Tribal University in Telangana : హసన్‌-చర్లపల్లి పైపులైన్‌ వల్ల ఎల్పీజీ విస్తరణను సైతం పెంచేందుకు చర్యలు చేపట్టామని మోదీ తెలిపారు. కృష్ణపట్నం- హైదరాబాద్‌ మధ్య మల్టిపైప్‌లైన్‌ పనులు ప్రారంభించుకోవడం తెలంగాణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. 900 కోట్లతో ములుగు జిల్లాకు కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం (Tribal University ) మంజూరు చేస్తున్నట్టు మోదీ ప్రకటించారు.

తెలంగాణ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు. ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విశ్వవిద్యాలయానికి ఆదివాసీల ఆరాధ్యదేవతలు సమ్మక్క-సారక్క పేరు పెట్టుకోవడం సంతోషకరం. 900 కోట్ల ఖర్చుతో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం. - నరేంద్ర మోదీ, ప్రధాని

PM Modi Telangana Tour : వరంగల్ నుంచి ఖమ్మం, ఖమ్మం నుంచి విజయవాడకు 4 వరుసల రహదారికి, కృష్ణపట్నం-హైదరాబాద్‌ మధ్య మల్టీప్రోడక్ట్‌ పైప్‌లైన్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రూ.2,457 కోట్లతో నిర్మించిన.. సూర్యాపేట-ఖమ్మం 4వరుసల రహదారిని, రూ.505 కోట్లతో నిర్మించిన 37 కిలోమీటర్ల జక్లేర్‌-క్రిష్ణా నూతన రైల్వే మార్గాన్ని జాతికి అంకితం చేశారు. రూ.2,661 కోట్లతో హసన్‌- చర్లపల్లి హెచ్​పీసీఎల్​.. ఎల్పీజీ పైప్ లైన్‌ జాతికి అంకితమిచ్చారు. వేదికపై నుంచి వర్చువల్‌గా కాచిగూడ-రాయిచూర్‌ రైలును.. జెండా ఊపి మోదీ ప్రారంభించారు.

PM Modi Warangal Tour : దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర: మోదీ

రూ.81.27 కోట్లతో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నిర్మించిన భవనాల్ని ప్రారంభించిన ప్రధాని మోదీ … 'ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌'గా హెచ్​సీయూను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. దీంతో విశ్వవిద్యాలయంలో వసతుల కల్పనతో పాటు అధిక నిధులు వస్తాయని వెల్లడించారు.

PM Modi On Telangana Formation in Parliament : 'తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగింది.. రక్తపుటేర్లు పారాయి'

PM Modi Warangal Tour Speech : '9 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేశాం'

Last Updated : Oct 1, 2023, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.