బంగాల్‌లో మూడో దశ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయడానికి భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) బుధవారం సమావేశమైంది. భాజపా కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయిన సీఈసీ.. నలుగురు అభ్యర్థులను ఖరారు చేసింది. ఉలుబేరియా దక్షిణ్ నియోజవర్గానికి నటుడు పాపియా అధికారి అభ్యర్థిగా ప్రకటించిన భాజపా.. జగత్‌బల్లావ్‌పుర్ నుంచి మాజీ కాంగ్రెస్ నేత అనుపమ్ ఘోష్‌కు టికెట్ ఇచ్చింది. ఫౌల్తా అసెంబ్లీ నియోజవర్గానికి బిధాన్ పరుయి, బారుపుర్ పూర్బా అసెంబ్లీ స్థానానికి చందన్ మండలాలను నిలబెట్టింది.
నాలుగు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటివరకూ నామినీలను ప్రకటించన స్థానాలకూ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. సీఈసీ ఇప్పటివరకూ అసోంతో పాటు బంగాల్ మెుదట దశ అభ్యర్థల జాబితాను ప్రకటించింది. కేరళలోని పలు స్థానాలకు సైతం నామినీలను ఖరారు చేయడం సహా పుదుచ్చేరిలోని 9 నియోజకవర్గాల్లో భాజపా తరపును పోటీ చేసే వారి పేర్లను విడుదల చేసింది.
అటు అసోం, బంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనుండగా.. మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 మధ్య ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ జరుగనుంది. బంగాల్‌లో 8 దశల్లో, అసోంలో నాలుగు దశల్లో పోలింగ్ జరగనుండగా.. మిగిలిన రాష్ట్రాల్లో మెుదటి దశలోనే అన్ని స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: 'సువేందు నామినేషన్ రద్దు చేయండి'