ETV Bharat / bharat

మోదీ పర్యటనలో భద్రతా లోపం- 150 మందిపై కేసు - pm modi security

PM Modis Security Breach: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలు తలెత్తిన ఘటనలో 150 మంది గుర్తుతెలియని వ్యక్తులపై కేసులు నమోదు చేశారు ఫిరోజ్​పుర్ జిల్లా పోలీసులు. గురువారం కుల్​గరీ పోలీసు స్టేషన్​లో ఈమేరకు ఎఫ్​ఐఆర్​లు నమోదయ్యాయి.

PM Modis security breach
మోదీ పంజాబ్ ఘటన
author img

By

Published : Jan 8, 2022, 6:55 AM IST

Updated : Jan 8, 2022, 8:04 AM IST

PM Modis Security Breach: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంజాబ్‌ పర్యటనలో భద్రతా వైఫల్యం వ్యవహారానికి సంబంధించి ఫిరోజ్​పుర్​ పోలీసులు 150 మంది గుర్తుతెలియని వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగించినందుకు జిల్లాలోని కుల్​గరి పోలీస్​ స్టేషన్​లో వీరిపై ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశారు.

నివేదిక..

మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోంశాఖ ఓ బృందాన్ని ఫిరోజ్​పుర్ పంపింది. వారు ఆ ప్రాంతాన్ని సందర్శించి సీనియర్ అధికారులతో చర్చించారు. ఈ ఘటనపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశామని చెప్పిన పంజాబ్​ ప్రభుత్వం ఓ నివేదికను కూడా కేంద్ర బృందానికి సమర్పించింది.

ఇదీ జరిగింది..

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో గత బుధవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఫిరోజ్‌పుర్‌ జిల్లాలో నిరసనకారులు రహదారిని దిగ్బంధించడం వల్ల.. ప్రధాని, ఆయన వాహనశ్రేణి 15-20 నిమిషాల పాటు పైవంతెనపై చిక్కుకుపోయింది. దీంతో ప్రధాని తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని దిల్లీకి తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. నాటకీయ పరిణామాల మధ్య ఫిరోజ్​పుర్​లో జరగాల్సిన సభ ఆకస్మికంగా రద్దు అయింది. పంజాబ్​లో మోదీ అడుగుపెట్టినప్పటికీ.. సభకు హాజరు కాకుండానే తిరిగి ఆయన దిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే సభకు మోదీ హాజరు కాలేకపోయారని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ ఘటన దేశంలో తీవ్ర రాజకీయ దుమారం రేపింది.

ఇదీ చదవండి: ప్రధాని భద్రత అందుకే అంత కట్టుదిట్టం! ఎస్పీజీ నిర్ణయమే అల్టిమేట్!!

Last Updated : Jan 8, 2022, 8:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.