ETV Bharat / bharat

'మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి'

మహిళలు తలుచుకుంటే ఎలాంటి మార్పునైనా తీసుకురాగలరని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 'ఆత్మనిర్భర్ నారీ శక్తి సే సంవాద్​' కార్యక్రమంలో భాగంగా సహకార సంఘాల్లో సభ్యులైన పలువురు మహిళలతో ఆయన సమావేశమయ్యారు. దేశంలోని 4 లక్షలకు పైగా మహిళా సంఘాలకు రూ.1,625 కోట్ల ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారు.

modi
మోదీ
author img

By

Published : Aug 12, 2021, 2:10 PM IST

Updated : Aug 12, 2021, 3:45 PM IST

మహిళలు సాధికారత సాధిస్తే.. కుటుంబంతో పాటు సమాజం బాగుపడుతుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 'ఆత్మనిర్భర్ నారీ శక్తి సే సంవాద్​' కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం వర్చువల్​గా జరిగిన ఈ సమావేశంలో దేశంలోని పలు స్వయం సహకార సంఘాలకు(ఎస్​హెచ్​జీ) చెందిన మహిళలతో మోదీ ముచ్చటించారు.

"మహిళా సాధికారతతో కుటుంబం మాత్రమే కాదు.. సమాజం మొత్తం బాగుపడుతుంది. దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. వారి కృషికి తగిన గుర్తింపు ఇవ్వడం సహా మహిళలు.. తమ శక్తి, సామర్థ్యాలతో ఎలాంటి మార్పునైనా తీసుకురాగలరు."

--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

అటు దేశంలోని 4 లక్షలకు పైగా మహిళా సంఘాలకు రూ.1,625 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రధాని మంజూరు చేశారు. వీటికి అదనంగా 75మంది మహిళా రైతులకు రూ.4.13 కోట్ల సాయాన్ని విడుదల చేశారు.

ఇదీ చూడండి: సహకార సంఘాలపై పట్టు కోసమే కొత్త శాఖ!

Last Updated : Aug 12, 2021, 3:45 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.