నేడు 'షాహిదీ దివాస్' సందర్భంగా శ్రీ గురు తేజ్ బహదూర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఆయన ధైర్యసాహసాలను ట్విట్టర్ వేదికగా స్మరించుకున్నారు.
"శ్రీ గురు తేజ్ బహదూర్ జీవితం మొత్తం ధైర్యసాహసాలు, పట్టుదలతో నిండినది. షాహిదీ దివాస్ సందర్భంగా సమీకృత సమాజం కోసం పాటుపడిన తేజ్ బహదూర్ గారికి నమస్కరిస్తున్నాను."
--ట్విట్టర్లో ప్రధాని నరేంద్ర మోదీ.
గురుతేజ్ బహదూర్ తొమ్మిదవ సిక్కు గురువు. ఆయన 1621లో జన్మించారు. 1675 డిసెంబర్ 19న వీరమరణం పొందారు.
గోవా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
గోవా 60వ విమోచన దినం సందర్భంగా గోవా ప్రజలకు ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
"పోర్చుగీస్ పాలన నుంచి గోవా విముక్తి కోసం కృషి చేసిన వారిని గుర్తు చేసుకోవాల్సిన సమయమిది. గోవా అభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను."
--ట్విట్టర్లో ప్రధాని మోదీ.
విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం గోవా రాష్ట్ర ప్రభుత్వం పనాజీలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరు కానున్నారు.
ఇదీ చదవండి : బంగాల్ చేరుకున్న అమిత్ షా- 2 రోజుల పర్యటన