కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జయంతి సందర్భంగా మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు నివాళులర్పించారు. వారికి ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వం కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ గొంతుకగా ఉండేవారని.. భాజపా నేతలు కొనియాడారు. ప్రతి సమస్యపై అవగాహన కలిగి ఉండేవారని.. దేశ రాజకీయాల్లో జైట్లీకున్న అపార అనుభవంతోనే ఇది సాధ్యమైందని కీర్తించారు.
1952 డిసెంబర్ 28న జన్మించిన అరుణ్ జైట్లీ 2019 ఆగస్టులో మరణించారు.
-
Remembering my friend, Arun Jaitley Ji on his birth anniversary. His warm personality, intellect, legal acumen and wit are missed by all those he closely interacted with. He worked tirelessly for India’s progress.
— Narendra Modi (@narendramodi) December 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Remembering my friend, Arun Jaitley Ji on his birth anniversary. His warm personality, intellect, legal acumen and wit are missed by all those he closely interacted with. He worked tirelessly for India’s progress.
— Narendra Modi (@narendramodi) December 28, 2020Remembering my friend, Arun Jaitley Ji on his birth anniversary. His warm personality, intellect, legal acumen and wit are missed by all those he closely interacted with. He worked tirelessly for India’s progress.
— Narendra Modi (@narendramodi) December 28, 2020
నా మిత్రుడు, అరుణ్ జైట్లీ మనమధ్య లేకపోవడం బాధాకరం. వ్యక్తిగతంగా ఆయనతో నాకున్న సాన్నిహిత్యం మరువలేనిది. ఆయన న్యాయశాస్త్ర కోవిదుడు, అపార జ్ఞాని. అనునిత్యం దేశ ప్రగతికి పాటుపడ్డారు.
-మోదీ ట్వీట్
అరుణ్ జైట్లీకి నివాళులర్పించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన సేవలను స్మరించుకున్నారు. మేలైన పనితీరు, అంకిత భావంతో భారతీయ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఆయనొక ఉత్తమ పార్లమెంటేరియన్ అని తెలిపారు.
దేశ ప్రజల జీవితాల బాగుకై జైట్లీ నిరంతరం పాటుపడ్డారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. పార్టీని బలోపేతానికి సైతం ఆయన కృషి మరువలేనిదని పేర్కొన్నారు.
అరుణ్‌జైట్లీ అత్యుత్తమ వక్త అన్నారు భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా. తన రాజకీయ వ్యూహాలతో ఎంతటి సమస్యనైనా పరిష్కరించేవారని గుర్తుచేసుకున్నారు.
ఇదీ చదవండి: దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఉత్తరాఖండ్ సీఎం