ETV Bharat / bharat

కాంగ్రెస్​పై మోదీ ఫైర్.. ఓడినా అహంకారం తగ్గలేదంటూ.. - మోదీ ప్రసంగం లోక్​సభ

PM Modi in Lok Sabha: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్​సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. కాంగ్రెస్ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలోని పలు రాష్ట్రాలు కాంగ్రెస్​ను అధికారానికి దూరం చేసి ఏళ్లు గడిచిపోయిందని అన్నారు. తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే పార్టీ.. అక్కడ అధికారంలోకి రాలేకపోయిందని ఎద్దేవా చేశారు. విభజించు-పాలించు అనేది కాంగ్రెస్ నినాదమని మండిపడ్డారు.

MODI NEWS
MODI NEWS
author img

By

Published : Feb 7, 2022, 5:54 PM IST

Updated : Feb 7, 2022, 9:21 PM IST

PM Modi in Lok Sabha: కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన మోదీ.. కాంగ్రెస్​పై నిప్పులు చెరిగారు. అనేక రాష్ట్రాలు కాంగ్రెస్​ను గద్దె దించాయని, చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయించి ఏళ్లు గడిచిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్ అహంకారం మాత్రం తగ్గడం లేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని చెప్పారు.

"ఈరోజు దేశంలోని పేద ప్రజలకు గ్యాస్ కనెక్షన్ లభిస్తోంది. ఇళ్లు, శౌచాలయాలు లభిస్తున్నాయి. సొంతంగా బ్యాంకు ఖాతాను ఉపయోగించుకుంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు కొందరి(కాంగ్రెస్​ను ఉద్దేశించి) ఆలోచనలు 2014లోనే ఉండిపోయాయి. బంగాల్, అసోం, తమిళనాడు, ఛత్తీస్​గఢ్ వంటి పలు రాష్ట్రాలు కాంగ్రెస్​ను ఎప్పుడో మర్చిపోయాయి. తెలంగాణ ఇచ్చామని మీరు చెప్పుకుంటారు. కానీ అక్కడి ప్రజలు మిమ్మల్ని ఆదరించలేదు. ఝార్ఖండ్ ఏర్పడి 20 ఏళ్లు అవుతోంది. అయినా ఇప్పటికీ అక్కడ ప్రజల మనసులను గెలుచుకోలేకపోయారు. పరోక్ష మార్గంలో అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు. ఎన్ని ఎన్నికల్లో ఓడిపోయినా మీ(కాంగ్రెస్) అహంకారం మాత్రం తగ్గలేదు."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్లు గడిచినా కొందరి తీరు మాత్రం మారలేదని మోదీ వాగ్బాణాలు సంధించారు. బ్రిటిషర్ల సూత్రమైన విభజించు-పాలించు అనే పద్ధతిని కాంగ్రెస్ పార్టీ ఒంటబట్టించుకుందని ధ్వజమెత్తారు. దేశ విభజన శక్తులకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తోందని మండిపడ్డారు. కరోనాపైనా కాంగ్రెస్ రాజకీయాలు చేసిందని విమర్శించారు.

PM Modi news:

వచ్చే వందేళ్ల వరకు అధికారంలోకి రాకూడదని కాంగ్రెస్ పార్టీ నిశ్చయించుకుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు మోదీ. తాము కూడా వందేళ్ల వరకు అధికారంలో ఉండేందుకు సిద్ధంగా ఉంటామని చురకలు అంటించారు.

"మీరు నన్ను వ్యతిరేకించవచ్చు. కానీ ఫిట్ ఇండియా పథకాన్ని, ఇతర పథకాలను మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వోకల్ ఫర్ లోకల్ గురించి మాట్లాడినప్పుడు మీరు నన్ను విస్మరిస్తారు. మోదీ చెప్పారు కాబట్టి ఆ పదాన్నే పలకకూడదని మీరు అనుకుంటారు. స్వదేశీ వస్తువులను ఉపయోగించాలని మహాత్మా గాంధీనే స్వయంగా చెప్పారు. మహాత్మా గాంధీ కలను నెరవేర్చేందుకు మీరు(కాంగ్రెస్) ఎందుకు కృషి చేయడం లేదు. ఇన్ని రాష్ట్రాల్లో ఏళ్ల నుంచి ఎందుకు అధికారంలోకి రాలేకపోయారో ఇక్కడే అర్థమవుతోంది. తర్వాతి వందేళ్ల వరకు అధికారంలోకి రాకూడదని మీరు నిర్ణయించుకున్నట్లు అనిపిస్తోంది. కాబట్టి.. మేం కూడా అందుకు సిద్ధంగా ఉంటాం."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

1971 నుంచి పేదరిక నిర్మూలన అంశంపై మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికలను గెలుస్తూ వచ్చిందన్న మోదీ.. పేదరికం మాత్రం ఎక్కడికీ పోలేదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీని చూసి విసుగెత్తిన ప్రజలు.. కాంగ్రెస్​ను అధికారంలో నుంచి దింపేశారని అన్నారు.

నాయకత్వ పాత్ర మనదే

కరోనా మహమ్మారి అనంతరం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయని మోదీ అన్నారు. కరోనా నిర్వహణ తీరును చూసి ఇతర దేశాలన్నీ భారత్​కు కితాబిచ్చాయని చెప్పారు. భారత్​ను.. ప్రపంచ దేశాలు గ్లోబల్ లీడర్​గా గుర్తిస్తున్నాయని పేర్కొన్నారు. భారత్ ఈ నాయకత్వ పాత్రను పోషించాల్సి ఉందని అన్నారు.

లతాజీకి సంఘీభావం

ప్రసంగం ప్రారంభంలో.. ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల సంఘీభావం ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. లతా మంగేష్కర్ యావద్దేశాన్ని ఏకం చేశారని మోదీ పేర్కొన్నారు. తన గాత్రంతో దేశాన్ని కదిలించారని అన్నారు.

ఇదీ చదవండి: జడ్ కేటగిరీ భద్రత స్వీకరించండి.. ఒవైసీకి షా విజ్ఞప్తి

Last Updated : Feb 7, 2022, 9:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.