ETV Bharat / bharat

Modi UP: 'గంగా ఎక్స్​ప్రెస్​వేతో యువతకు అపార ఉపాధి అవకాశాలు' - మోదీ గంగా ఎక్స్​ప్రెస్​ వే

Ganga Expressway: ఉత్తర్​ప్రదేశ్​లోని షాజహాన్​​పుర్​ వద్ద గంగా ఎక్స్​ప్రెస్​వేకు శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ఎక్స్​ప్రెస్​వే ద్వారా యువతకు ఉపాధి సహా ఎన్నో కొత్త అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. త్వరలోనే అత్యాధునిక వసతులు కలిగిన రాష్ట్రంగా యూపీ నిలుస్తుందని చెప్పారు.

modi
మోదీ
author img

By

Published : Dec 18, 2021, 2:33 PM IST

Updated : Dec 18, 2021, 3:42 PM IST

Ganga Expressway: గంగా ఎక్స్​ప్రెస్​వే ద్వారా యువతకు ఉపాధి సహా ఎన్నో కొత్త అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. త్వరలోనే అత్యాధునిక మౌలిక వసతులు కలిగిన రాష్ట్రంగా ఉత్తర్​ప్రదేశ్​ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్స్​ప్రెస్​వేలు, విమానాశ్రయాలు, రైలు మార్గాల నిర్మాణమే అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. ఉత్తర్​ప్రదేశ్ షా​జహాన్​పుర్​లోని గంగా ఎక్స్​ప్రెస్​వేకు శనివారం శంకుస్థాపన చేశారు మోదీ. ఈ సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

"మేరఠ్​​, హాపుర్, బులంద్ శహర్​, అమ్రోహా, సంభాల్​, బదౌన్​, షాజహాన్​పుర్​, హర్దోయ్​, ఉన్నావ్​, రాయ్​బరేలీ, ప్రతాప్​గఢ్​, ప్రయాగ్​రాజ్ జిల్లా ప్రజలకు అభినందనలు. రూ.36,000 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఎక్స్​ప్రెస్​వే ద్వారా ఇక్కడి ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలు వెలుస్తాయి. అత్యాధునిక మౌలిక వసతులు కలిగిన రాష్ట్రంగా ఉత్తర్​ప్రదేశ్​ను గుర్తించే రోజు ఎంతో దూరంలో లేదు. ఇక్కడ నిర్మిస్తున్న ఎక్స్​ప్రెస్​వేలు, విమానాశ్రయాలు, రైలు మార్గాలు ప్రజలకు అరుదైన అవకాశాలను కల్పిస్తాయి."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

Modi Up Development: "వనరులను ఎలా ఉపయోగించాలనేదానికి ఉత్తర్​ప్రదేశ్​కు తరలివస్తున్న ఆధునిక మౌలిక వసతులే ఉదాహరణ. అంతకుముందు ప్రజాధనాన్ని ఎలా వినియోగించారో మీరు చూశారు. కానీ, ఈ రోజు యూపీ ప్రజల సొమ్మును యూపీ అభివృద్ధి కోసమే వినియోగిస్తున్నాం. గతంలో పెద్ద ప్రాజెక్టులకు కాగితాలకే పరిమితమయ్యాయి" అని మోదీ పేర్కొన్నారు.

'యూపీ ప్లస్​ యోగి..'

Pm Modi On Up cm: "గతంలో యూపీలో శాంతి భద్రతలు క్షీణించి ఉండడం వల్ల చాలా మంది రాష్ట్రాన్ని వదలివెళ్లారు. కానీ, గత నాలుగన్నరేళ్లుగా... మాఫియాలు దోచుకున్న ఆస్తులను బుల్డోజర్లు ధ్వంసం చేశాయి. మాఫియాను ఆదరించే వారికి ముచ్చెమటలు పట్టాయి"అని మోదీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్​ యూపీలో మాఫియాను అరికట్టి, అభివృద్ధి పనులను ముందుకు తీసుకువెళ్లారని ప్రశంసించారు. యూపీకి యోగీతో చాలా ఉపయోగం కలిగిందని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా రోడ్లను అనుసంధానించాలనే మోదీ లక్ష్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. 594 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ సిక్స్​లేన్​ ఎక్స్​ప్రెస్​వేను రూ.36,200 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ ఎక్స్​ప్రెస్​వే.. మేరఠ్​లోని బిజౌలీ గ్రామంలో ప్రారంభమై ప్రయాగరాజ్​లోని జుదాపుర్​ దండు గ్రామం వరకు ఉంటుంది. ఈ ఎక్స్​ప్రెస్​వే వద్దే 3.5 కిలోమీటర్ల ఎయిర్​ స్ట్రిప్​ను కూడా నిర్మిస్తున్నారు. 2024 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తికానుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి : 'అగ్ని-ప్రైమ్' క్షిపణి ప్రయోగం విజయవంతం

Last Updated : Dec 18, 2021, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.