PM Modi in Pune: మహారాష్ట్రలోని పుణెలో మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అనంతరం టికెట్టు కొనుగోలు చేసి గర్వేర్ మెట్రో స్టేషన్ నుంచి ఆనంద్ నగర్ వరకు మెట్రోలో ప్రయాణించారు. పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు.
![PM Modi inaugurates Pune metro rail project](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14652315_modi5.jpg)
![PM Modi inaugurates Pune metro rail project](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14652315_modi3.jpg)
రూ.11,400 కోట్లతో మొత్తం 32.2 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన 12 కిలోమీటర్లను ప్రారంభించారు మోదీ. ఈ ప్రాజెక్టుకు 2016, డిసెంబర్ 24న శంకుస్థాపన చేశారు ప్రధాని.
![PM Modi inaugurates Pune metro rail project](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14652315_modi.jpg)
![PM Modi inaugurates Pune metro rail project](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14652315_modi4.jpg)
శివాజీ మహారాజ్ విగ్రహం ఆవిష్కరణ
పుణె మెట్రో ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్రకు వచ్చిన ప్రధాని మోదీ.. పుణె మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని 1,850 కిలోల గన్మెటల్తో 9.5 అడుగుల ఎత్తుతో తయారు చేశారు.
![PM Modi inaugurates Pune metro rail project](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-pun-04-pune-pmc-modi-udhghatan-avb-7210735_06032022113752_0603f_1646546872_758.jpg)
![PM Modi inaugurates Pune metro rail project](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14652315_modi2.jpg)
![PM Modi inaugurates Pune metro rail project](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14652315_modi1.jpg)
అలాగే.. సామాజిక సంస్కర్త మహాత్మ జోతిబాపూలే విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు మోదీ. అంతకుముందు లెహెగావూన్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి.. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, రాష్ట్ర మంత్రి సుభాష్ దేశాయ్, దేవేంద్ర ఫడణవీస్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ స్వాగతం పలికారు.
కాంగ్రెస్, ఎన్సీపీ నిరసన..
ప్రధాని మోదీ పుణె పర్యటన నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు బాబాసాహెబ్ అంబేడ్కర్ మెమోరియల్ వద్ద శాంతియుత నిరసన తెలిపాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి, మహాత్మాగాంధీ సూక్తులతో ఉన్న ప్లకార్డులతో నినాదాలు చేశారు నేతలు. పుణె ప్రజలను ప్రధాని మోదీ.. ఉప ఎన్నికలతో మోసగించారని ఆరోపించారు ఇరు పార్టీల నేతలు. ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న మోదీకి ఉక్రెయిన్లోని విద్యార్థులపై ఆందోళన లేదన్నారు. కానీ, పూర్తికాని మెట్రోను ప్రారంభించేందుకు సమయం ఉంటుందని విమర్శించారు.
![PM Modi inaugurates Pune metro rail project](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-pun-01-rashtravadi-naredramodi-metro-punecity-pune-avb-mh10069_06032022104103_0603f_1646543463_215.jpg)
ఇదీ చూడండి: కాశీ విశ్వనాథుడి సన్నిధిలో 'డమరుకం' మోగించిన మోదీ