ఉత్తర్‌ప్రదేశ్ సుల్తాన్‌పుర్ జిల్లాలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi news). అంతకుముందు సీ-130జే యుద్ధ విమానంలో రహదారిపైనే ల్యాండ్ అయ్యి.. వినూత్నంగా కార్యక్రమానికి హాజరయ్యారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రధానికి సాదర స్వాగతం పలికారు(Modi news latest).
లఖ్‌నవూను యూపీలోని తూర్పున ఉండే ప్రాంతాలను కలుపుతూ 340.8 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు. ఆరు లేన్ల ఈ ఎక్స్‌ప్రెస్ వే(Purvanchal Expressway route).. బారాబంకి, అమేఠీ, సుల్తాన్‌పుర్, అయోధ్య, అంబేడ్కర్ నగర్, ఆజంగఢ్, మౌ, గాజీపుర్ జిల్లాలను (Purvanchal Expressway route map 2021) కలుపుతుంది. రహదారిలో భాగంగా సుల్తాన్‌పుర్ వద్ద 3.2 కిలోమీటర్ల ఎయిర్‌స్ట్రిప్ సిద్ధం చేశారు. అత్యవసర సమయంలో యుద్ధ విమానాలు దిగేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్స్ట్రిప్పైనే మోదీ యుద్ధ విమానంలో దిగారు.
వాహనదారులకు ప్రయోజనం కలిగేలా, ఇంధన వాడకం తగ్గేలా ఈ రహదారిని నిర్మించారు. భవిష్యత్‌లో దీన్ని ఎనిమిది వరుసల రహదారిగా మార్చుకోవచ్చు. రూ.22,500 కోట్ల వ్యయంతో రహదారిని పూర్తి చేశారు.
ఇదీ చదవండి: బలమైన ఆడిట్లతోనే పారదర్శక వ్యవస్థ: మోదీ