ETV Bharat / bharat

'అది అవినీతి నేతల సమూహం.. వారి దుకాణాల్లో కరప్షన్ అన్​లిమిటెడ్!'

PM Modi On Oppositions : ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు. వంశపారంపర్య పార్టీలకు పేదలు ముఖ్యం కాదని.. కుటుంబమే ముఖ్యమని ఆరోపించారు. విపక్ష కూటమి సమావేశాలను అవినీతి నేతల సమూహంగా అభివర్ణించారు ప్రధాని మోదీ.

PM Modi On Oppositions
PM Modi On Oppositions
author img

By

Published : Jul 18, 2023, 12:24 PM IST

Updated : Jul 18, 2023, 12:56 PM IST

PM Modi On Oppositions : బెంగళూరులో విపక్షాల సమావేశం జరుగుతున్న వేళ.. ప్రతిపక్షాల లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ప్రజలు 2024లో కేంద్రంలో మళ్లీ బీజేపీ సర్కారును అధికారంలోకి తీసుకురావాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారని అన్నారు. అందుకే భారతదేశ దుస్థితికి కారణమైన వ్యక్తులు ఇప్పుడు తమ దుకాణాలను తెరిచారని విమర్శించారు. వారి దుకాణాల్లో కులతత్వ విషం, అపారమైన అవినీతి దొరుకుతుందంటూ.. ప్రతిపక్షాల సమావేశంపై ప్రధాని మోదీ మండిపడ్డారు. పోర్ట్ బ్లెయిర్‌లోని వీర్ సావర్కర్ విమానాశ్రయం కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ మంగళవారం దిల్లీ నుంచి వర్చువల్​గా ప్రారంభించారు.

  • #WATCH | Prime Minister Narendra Modi inaugurates the New Integrated Terminal Building of Veer Savarkar International Airport in Port Blair, via video conferencing. pic.twitter.com/UXKLEk7iaV

    — ANI (@ANI) July 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు చెందిన, ప్రజల కొరకు, ప్రజల చేత అని అర్థం. కానీ వంశపారంపర్య రాజకీయ పార్టీలకు ఈ నిర్వచనం వేరేలా ఉంటుంది. కుటుంబం కోసం అన్నట్లు వ్యవహరిస్తారు. కుటుంబమే వారి మొదటి ప్రాధాన్యం. దేశం గురించి పట్టించుకోరు. ఇది వారి నినాదం. ద్వేషం, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు చేస్తారు. వంశపారంపర్య రాజకీయాలకు కొన్నాళ్ల క్రితం వరకు దేశం బలైపోయింది. ప్రతిపక్షాలకు దేశంలోని పేదలు ముఖ్యం కాదు.. వారి కుటుంబ ఎదుగుదల మాత్రమే ముఖ్యం."
-నరేంద్ర మోదీ, భారత ప్రధాని

  • #WATCH | Delhi: PM Narendra Modi takes a jibe at the Opposition; says, "In democracy, it is of the people, by the people and for the people. But for the dynastic political parties, it is of the family, by the family and for the family. Family first, nation nothing. This is their… pic.twitter.com/4xNzzDQxQq

Opposition Meeting In Bangalore : విపక్ష కూటమి సమావేశాలను అవినీతి నేతల సమూహంగా అభివర్ణించారు మోదీ. "భారత్‌ను దుస్థితిలోకి నెట్టిన నాయకులు.. తమ దుకాణాలు తెరిచి కూర్చుకున్నారు. వారంతా ఇప్పుడు బెంగళూరులో సమావేశమయ్యారు. వారంతా కెమెరాలో ఒక ఫ్రేమ్‌లోకి వచ్చినప్పుడు, ఆ ఫ్రేమ్‌ను చూసిన ప్రజలు లక్షలాది రూపాయల అవినీతి వ్యవహారాలే గుర్తుకు వస్తున్నాయని చెబుతున్నారు. కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడి ఎవరైనా బెయిల్‌పై బయటకు వస్తే ఈ సభ వారిని ప్రత్యేకంగా చూస్తుంది. కుటుంబం మొత్తం బెయిల్‌పై బయట ఉంటే వారికి మరింత గౌరవం ఇస్తుంది" అని మోదీ అన్నారు.

  • #WATCH | PM Narendra Modi takes a swipe at the Opposition; says, "...Today, people of the country have already decided to bring us back in 2024. So, people who are responsible for the plight of India have opened their shops...24 ke liye 26 hone waale rajnaitik dalon par ye bada… pic.twitter.com/UewufX8MQJ

అవినీతిని ప్రోత్సహించేందుకే విపక్షాల బెంగళూరు సమావేశం అని ప్రజలు అంటున్నారు. తమిళనాడులో అవినీతి కేసులు ఉన్నా డీఎంకేకు ప్రతిపక్ష పార్టీలు క్లీన్​చిట్ ఇచ్చాయి. బంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో హింస చెలరేగింది. ఆ హింసలో కాంగ్రెస్‌, లెఫ్ట్‌ కార్యకర్తలు మరణించారు. ఈ పార్టీలు తమ కార్యకర్తలను గాలికొదిలి టీఎంసీతో జట్టుకట్టాయి.

--నరేంద్ర మోదీ, భారత ప్రధాని

  • On the joint Opposition meeting in Bengaluru, PM Modi says, "People of the country say that this is a 'Kattar Bhrashtachar Sammelan'...Another speciality of this meeting is that if someone is out on bail in a corruption of crores of Rupees, they are seen with great respect. If… pic.twitter.com/Ln2Kd12iD1

Veer Savarkar International Airport Inauguration : వీర్ సావర్కర్ విమానాశ్రయంలోని కొత్త టెర్మినల్ భవనం పర్యటకాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు ప్రధాని మోదీ. ఈ ఎయిర్​పోర్టు కొత్త టెర్మినల్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. కేంద్రంలోని ఎన్​డీఏ ప్రభుత్వం గత 9 ఏళ్లలో అండమాన్ నికోబార్ దీవుల అభివృద్ధి కోసం రూ.48 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. 2014 నుంచి అండమాన్‌కు పర్యటకుల ప్రవాహం రెట్టింపు అయ్యిందని తెలిపారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వీర్​ సావర్కర్‌ విగ్రహాన్ని.. పౌర విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా ఆవిష్కరించారు.

  • #WATCH | Delhi: "... With this new terminal in Port Blair, the ease of travel will improve, ease of doing business will improve and the connectivity will also improve...," says PM Modi as he inaugurates the New Integrated Terminal Building of Veer Savarkar International Airport… pic.twitter.com/Hm4Ir4NOvd

Last Updated : Jul 18, 2023, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.