ETV Bharat / bharat

'వివక్షకు తావులేని వ్యవస్థగా నవ భారత్' - ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ కార్యక్రమం

వివక్షకు తావు లేని వ్యవస్థ రూపుదిద్దుకుంటోందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రగతిశీల నిర్ణయాలు, వినూత్న ఆలోచనా విధానం కలిగిన భారత్​ ఆవిర్భవించిందని ఉద్ఘాటించారు. బ్రహ్మకుమారీస్​ ఆధ్వర్యంలో జరిగే.. ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

Azadi Ke Amrit Mahotsav
Azadi Ke Amrit Mahotsav
author img

By

Published : Jan 20, 2022, 1:22 PM IST

దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సామాజిక రుగ్మతను పూర్తిగా నిర్మూలించి భారత్​ను సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు కృషి చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వివక్షకు ఏ మాత్రం తావు లేని సమాజ నిర్మాణం జరుగుతోందని, భారత్​ ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తుందని ఉద్ఘాటించారు.

'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కే ఓర్' జాతీయ స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ సందర్భంగా.. ఏడాది పొడవునా బ్రహ్మకుమారీస్​ నిర్వహించే ఈ కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టారు. 30కిపైగా క్యాంపెయిన్లు, 15 వేలకుపైగా వివిధ కార్యక్రమాలు ఇందులో భాగంగా ఉన్నాయి.

''వివక్షకు తావు లేని వ్యవస్థను మేం రూపొందిస్తున్నాం. సమానత్వం, సామాజిక న్యాయం అనే పునాదులపై బలంగా నిలబడే సమాజాన్ని నిర్మిస్తున్నాం. వినూత్నమైన ఆలోచనా విధానం, ప్రగతిశీల నిర్ణయాలతో కూడిన భారత్​ను మనం ఇప్పుడు చూస్తున్నాం.''

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

బ్రహ్మకుమారీస్​ ఆధ్వర్యంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న 7 కార్యక్రమాలను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు.

Azadi Ke Amrit Mahotsav se Swarnim Bharat Ki Ore'
బ్రహ్మకుమారీస్​ కార్యక్రమాలను ప్రారంభిస్తున్న మోదీ

ఆ ఏడు కార్యక్రమాలు.. మై ఇండియా హెల్దీ ఇండియా, ఆత్మనిర్భర్​ భారత్​: సెల్ఫ్​ రిలయంట్​ ఫార్మర్స్​, విమెన్​: ఫ్లాగ్​ బేరర్స్​ ఆఫ్​ ఇండియా, పవర్​ ఆఫ్​ పీస్​ బస్​ క్యాంపెయిన్​, అందేఖా భారత్​ సైకిల్​ ర్యాలీ, యునైటెడ్​ ఇండియా మోటార్​ బైక్​ క్యాంపెయిన్​, స్వచ్ఛ భారత్​ అభియాన్​లో భాగంగా చేపట్టే గ్రీన్​ ఇనిషియేటివ్స్​.

వ్యక్తిలో సంపూర్ణ పరివర్తన, పునరుద్ధరణ కోసం ఉద్దేశించిన ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక ఉద్యమం బ్రహ్మ కుమారీస్. భారత్​లో దీనిని 1937లో స్థాపించారు. ఇది ఇప్పుడు 130 దేశాలకుపైగా విస్తరించింది.

ఇవీ చూడండి: 'అరుణాచల్​' యువకుడ్ని​ అపహరించిన చైనా- రంగంలోకి భారత సైన్యం

మరో నిమిషంలో ఖననం అనగా.. గుక్కపెట్టి ఏడ్చిన 'మృత' శిశువు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.