లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా అఖిల పక్ష నేతలు భేటీ అయ్యారు. లోక్సభ సమావేశాల వాయిదాపై చర్చలు జరిపినట్లు స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. భవిష్యత్తులో సమావేశాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని నేతలను కోరినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.


బిర్లాతో భేటీలో లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, తృణమూల్ కాంగ్రెస్, శిరోమణి అకాలీ దళ్, వైకాపా, బిజూ జనతాదళ్ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.


పెగసస్ హ్యాకింగ్ వ్యవహారం సహా పలు అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్న గందరగోళ పరిస్థితుల్లో లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 13 వరకు సభ కొనసాగాల్సి ఉన్నా.. ఆందోళనల మధ్య చర్చలకు అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
ఇదీ చదవండి : వెంకయ్య తీవ్ర భావోద్వేగం- ఎంపీల తీరుపై ఆవేదన