PM Modi Elections Victory Speech : మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం.. నిజాయతీ, పారదర్శకత, సుపరిపాలనలకు నిదర్శనమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ మూడు విజయాలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్‌కు గ్యారంటీ ఇచ్చాయని తెలిపారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయదుంధబి మోగించిన నేపథ్యంలో దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసగించారు. కాషాయదళంపై ప్రేమను కురిపించినందుకుగానూ మూడు రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు.
-
VIDEO | "The impact of these assembly elections will just not be limited to MP, Rajasthan, and Chhattisgarh but it will be seen across the world," says PM Modi while addressing party workers at BJP headquarters in Delhi after the party's victory in assembly elections. pic.twitter.com/SbGaDmn4YT
— Press Trust of India (@PTI_News) December 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | "The impact of these assembly elections will just not be limited to MP, Rajasthan, and Chhattisgarh but it will be seen across the world," says PM Modi while addressing party workers at BJP headquarters in Delhi after the party's victory in assembly elections. pic.twitter.com/SbGaDmn4YT
— Press Trust of India (@PTI_News) December 3, 2023VIDEO | "The impact of these assembly elections will just not be limited to MP, Rajasthan, and Chhattisgarh but it will be seen across the world," says PM Modi while addressing party workers at BJP headquarters in Delhi after the party's victory in assembly elections. pic.twitter.com/SbGaDmn4YT
— Press Trust of India (@PTI_News) December 3, 2023
తెలంగాణలోనూ బీజేపీకి మద్దతు లభించిందన్నారు ప్రధాని మోదీ. తప్పుడు హామీలు, గాల్లో మాటలను ఓటర్లు విశ్వసించలేదంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. 'ఎన్నికల సమయంలో కులాల వారీగా దేశాన్ని విభజించేందుకు కొందరు ప్రయత్నించారు. పేపర్ లీక్, నియామకాల్లో కుంభకోణాలు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణాల్లో అధికార పక్షాల ఓటమికి కారణమయ్యాయి. అవినీతిపరులకు అండగా నిలిచిన, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు యత్నించినవారికి, 'ఘమండియా (అహంకారపూరిత)' కూటమికి.. ఈ విజయాలు స్పష్టమైన హెచ్చరిక. దర్యాప్తు సంస్థలపై ఆరోపణలు చేసినవారిని ప్రజలు తిరస్కరించారు. దేశ వ్యతిరేక శక్తులకు ఊతమిచ్చే రాజకీయాలకు పాల్పడొద్దు. అందరూ ఒక వేదికపైకి వస్తే.. మంచి ఫొటోలు, మీడియా ముఖ్యాంశాలు లభిస్తాయి. కానీ, ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేరు. మీ మార్గాలను సరిదిద్దుకోండి. లేకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు పంపుతారు' అని విపక్ష కూటమి 'ఇండియా' కూటమిపై ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ప్రతికూల శక్తులన్నీ ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చేందుకు యత్నిస్తాయని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. వాటితో పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
-
VIDEO | "Today's hattrick (BJP's win in three states) has given the guarantee of hattrick in 2024 (General elections)," says PM Modi while addressing party workers at BJP headquarters in Delhi after the party's victory in assembly elections. pic.twitter.com/gXeJjpTVCs
— Press Trust of India (@PTI_News) December 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | "Today's hattrick (BJP's win in three states) has given the guarantee of hattrick in 2024 (General elections)," says PM Modi while addressing party workers at BJP headquarters in Delhi after the party's victory in assembly elections. pic.twitter.com/gXeJjpTVCs
— Press Trust of India (@PTI_News) December 3, 2023VIDEO | "Today's hattrick (BJP's win in three states) has given the guarantee of hattrick in 2024 (General elections)," says PM Modi while addressing party workers at BJP headquarters in Delhi after the party's victory in assembly elections. pic.twitter.com/gXeJjpTVCs
— Press Trust of India (@PTI_News) December 3, 2023
తనవరకు కేవలం నాలుగే కులాలు (మహిళలు, యువత, రైతులు, పేదలు) ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఎన్నికల్లో వారంతా బీజేపీ పట్ల ఉత్సాహాన్ని ప్రదర్శించినట్లు చెప్పారు. అభివృద్ధి చెందిన భారత్‌ను చూడాలని కోరుకునే ప్రతి ఒక్కరూ బీజేపీ గెలుపులో తమ విజయాన్ని చూసుకుంటున్నట్లు తెలిపారు. తమ భద్రత, గౌరవానికి బీజేపీ మాత్రమే హామీ ఇవ్వగలదని మహిళలు విశ్వసిస్తున్నారన్నారు. దేశంలోని యువత అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని, వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసినవారిని తరిమికొట్టారని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ట్వీట్..
అంతకుముందు నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆ రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ ప్రజలు సుపరిపాలన, అభివృద్ధిపైనే విశ్వాసం ఉంచుతారని మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలు వెల్లడిచేస్తున్నాయని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. బీజేపీపై నమ్మకం ఉంచిన తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు, యువ ఓటర్లకు తన కృతజ్ఞతలను తెలిపారు. మీ సంక్షేమం కోసం తాము చేస్తోన్న పనిని కొనసాగిస్తామని హమీ ఇచ్చారు. తెలంగాణతో తమ బంధం విడదీయరానిదని వెల్లడించారు. బీజేపీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు మోదీ తెలియజేశారు.
-
We bow to the Janta Janardan.
— Narendra Modi (@narendramodi) December 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The results in Chhattisgarh, Madhya Pradesh and Rajasthan indicate that the people of India are firmly with politics of good governance and development, which the @BJP4India stands for.
I thank the people of these states for their unwavering…
">We bow to the Janta Janardan.
— Narendra Modi (@narendramodi) December 3, 2023
The results in Chhattisgarh, Madhya Pradesh and Rajasthan indicate that the people of India are firmly with politics of good governance and development, which the @BJP4India stands for.
I thank the people of these states for their unwavering…We bow to the Janta Janardan.
— Narendra Modi (@narendramodi) December 3, 2023
The results in Chhattisgarh, Madhya Pradesh and Rajasthan indicate that the people of India are firmly with politics of good governance and development, which the @BJP4India stands for.
I thank the people of these states for their unwavering…
బుజ్జగింపు, కుల రాజకీయాలకు గుడ్‌బై!
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో భారతీయ జనతా పార్టీ ఘన విజయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హర్షం వ్యక్తం చేశారు. బుజ్జగింపులు, కుల రాజకీయాల రోజులు ముగిసిపోయాయని ఇవాళ ఫలితాలు రుజువు చేశాయని అమిత్‌షా వివరించారు. నవీన భారతం పనిచేసే ప్రభుత్వాలకే పట్టంకట్టిందని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీపై ఉన్న విశ్వాసాన్ని ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజనులు, పేదలు, రైతు సోదర సోదరీమణులు ప్రదర్శించారని అమిత్ షా అన్నారు. బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించిన ఛత్తీస్‌గఢ్ ప్రజలకు ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ సంక్షేమ ఫలాలు, సుపరిపాలనకు మధ్యప్రదేశ్ ప్రజలు ఆమోదించి బీజేపీని ఆశీర్వదించారని పేర్కొన్నారు. అటు రాజస్థాన్‌లో బీజేపీ జయకేతనం ఎగరవేయడంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి- బీజేపీకి అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన వీరభూమి రాజస్థాన్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలని ట్వీట్ చేశారు.
-
छत्तीसगढ़ के जनजातीय, गरीब और किसान बहनों-भाइयों ने प्रधानमंत्री श्री @narendramodi जी में अपना विश्वास जताकर भाजपा को प्रचंड बहुमत का आशीर्वाद दिया है।
— Amit Shah (@AmitShah) December 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
इस विशाल जीत के लिए छत्तीसगढ़ की जनता का आभार व्यक्त करता हूँ। @BJP4CGState के हमारे सभी कार्यकर्ताओं, राष्ट्रीय अध्यक्ष श्री…
">छत्तीसगढ़ के जनजातीय, गरीब और किसान बहनों-भाइयों ने प्रधानमंत्री श्री @narendramodi जी में अपना विश्वास जताकर भाजपा को प्रचंड बहुमत का आशीर्वाद दिया है।
— Amit Shah (@AmitShah) December 3, 2023
इस विशाल जीत के लिए छत्तीसगढ़ की जनता का आभार व्यक्त करता हूँ। @BJP4CGState के हमारे सभी कार्यकर्ताओं, राष्ट्रीय अध्यक्ष श्री…छत्तीसगढ़ के जनजातीय, गरीब और किसान बहनों-भाइयों ने प्रधानमंत्री श्री @narendramodi जी में अपना विश्वास जताकर भाजपा को प्रचंड बहुमत का आशीर्वाद दिया है।
— Amit Shah (@AmitShah) December 3, 2023
इस विशाल जीत के लिए छत्तीसगढ़ की जनता का आभार व्यक्त करता हूँ। @BJP4CGState के हमारे सभी कार्यकर्ताओं, राष्ट्रीय अध्यक्ष श्री…
'సిద్ధాంతపరమైన యుద్ధం కొనసాగుతుంది'
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. గెలుపు, ఓటములతో సంబంధం లేదని సిద్ధాంతపరమైన యుద్ధం కొనసాగుతుందని చెప్పారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించిన తెలంగాణ ప్రజలకు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. దొరలకు, ప్రజలకు మధ్య జరిగిన యుద్ధంలో చివరికి ప్రజలే విజయం సాధించారని ఆయన పేర్కొన్నారు.
ఖర్గే స్పందన
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు ఓటు వేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. తెలంగాణ మినహా మిగతా మూడు రాష్ట్రాల్లో తమ పార్టీకి వచ్చిన ఫలితాలు నిస్సందేహంగా నిరుత్సాహానికి గురిచేశాయన్నారు. కానీ మరింత దృఢ నిశ్చయంతో ఈ మూడు రాష్ట్రాల్లో తమను తాము పునర్నిర్మించుకొనేందుకు పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఖర్గే గుర్తు చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతో ఉత్సాహంగా పోరాడిందని ఖర్గే అన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం లక్షలాది మంది కార్యకర్తలు చేసిన కృషిని ప్రశంసించారు. తాత్కాలికంగా ఎదురైన ఈ ఒడుదొడుకులను అధిగమించి- ఇండియా కూటమి పార్టీలతో కలిసి వచ్చే వారితో లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతామని పేర్కొన్నారు.
-
भारतीय राष्ट्रीय कांग्रेस पर विश्वास और भरोसा जताने के लिए मैं तेलंगाना के मतदाताओं का धन्यवाद करता हूँ ।
— Mallikarjun Kharge (@kharge) December 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
मैं उन सभी का भी धन्यवाद करता हूँ जिन्होंने हमें छत्तीसगढ़, मध्यप्रदेश एवं राजस्थान में वोट दिया। ये चुनाव परिणाम हमारी अपेक्षाओं के अनुरूप नहीं रहे हैं, परंतु हमें विश्वास…
">भारतीय राष्ट्रीय कांग्रेस पर विश्वास और भरोसा जताने के लिए मैं तेलंगाना के मतदाताओं का धन्यवाद करता हूँ ।
— Mallikarjun Kharge (@kharge) December 3, 2023
मैं उन सभी का भी धन्यवाद करता हूँ जिन्होंने हमें छत्तीसगढ़, मध्यप्रदेश एवं राजस्थान में वोट दिया। ये चुनाव परिणाम हमारी अपेक्षाओं के अनुरूप नहीं रहे हैं, परंतु हमें विश्वास…भारतीय राष्ट्रीय कांग्रेस पर विश्वास और भरोसा जताने के लिए मैं तेलंगाना के मतदाताओं का धन्यवाद करता हूँ ।
— Mallikarjun Kharge (@kharge) December 3, 2023
मैं उन सभी का भी धन्यवाद करता हूँ जिन्होंने हमें छत्तीसगढ़, मध्यप्रदेश एवं राजस्थान में वोट दिया। ये चुनाव परिणाम हमारी अपेक्षाओं के अनुरूप नहीं रहे हैं, परंतु हमें विश्वास…
సెమీఫైనల్స్‌లో బీజేపీ సూపర్ షో- విజయానికి ప్రధాన కారణాలివే!
తెలంగాణలో హిట్- రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో పవర్ కట్- 2024లో కాంగ్రెస్ దారెటు?