ETV Bharat / bharat

'విదేశీ వస్తువుల బానిసత్వం నుంచి బయటపడాలి' - స్వాలంబన భారత్​

విదేశీ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పుణెలోని జైన్​ ఇంటర్నేషనల్​ ట్రేడ్​ ఆర్గనైజేషన్​ను ప్రారంభించారు. ఆత్మనిర్భర భారత్​ మన మార్గం, సంకల్పమని పునరుద్ఘాటించారు.

PM Modi
ప్రధాని మోదీ
author img

By

Published : May 6, 2022, 12:53 PM IST

భారత్​ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటున్న తరుణంలో ప్రజలు విదేశీ వస్తువుల బానిసత్వం నుంచి బయటపడాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మహారాష్ట్ర, పుణెలోని జైన్​ ఇంటర్నేషనల్​ ట్రేడ్​ ఆర్గనైజేషన్​-(జేఐటీఓ)ను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించారు. అనంతరం 'జీటో కనెక్ట్​-2022' బిజినెస్​ మీట్​లో మాట్లాడారు. 'ఓకల్​ ఫర్​ లోకల్​' మంత్రాన్ని అవలంబించాలని, విదేశీ వస్తువుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు.

" విదేశీ వస్తువులపై ఆధారపడటాన్ని మనం తగ్గించాలి. ఎగుమతులకు కొత్త గమ్యాలను కనుక్కోవాలి. స్థానిక మార్కెట్లలోనూ దీనిపై అవగాహన కల్పించాలి. నాణ్యమైన, పర్యావరణహితమైన స్థానిక ఉత్పత్తుల కోసం జీరో డిఫెక్ట్‌, జీరో ఎఫెక్ట్ అనే సూత్రం ఆధారంగా మనం పనిచేయాలి. ప్రస్తుతం టాలెంట్​, ట్రేడ్​, టెక్నాలజీని దేశం ప్రోత్సహిస్తోంది. దేశంలో ప్రతిరోజు డజన్ల కొద్దీ స్టార్టప్స్​ నమోదవుతున్నాయి. ప్రతివారం ఒక యునికార్న్​ సంస్థ ఆవిర్భవిస్తోంది. ఆత్మనిర్భర భారత్​ మన మార్గం, మన సంకల్పం"

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ప్రజల మద్దతు ఉండి, ప్రభుత్వానికి ఏదైనా చేసే సంకల్పం ఉంటే గణనీయమైన మార్పు సాధ్యమవుతుందన్నారు మోదీ. 'జేఐటీఓ'లోని యువత.. భవిష్యత్తు ఆవిష్కరణకర్తలు, వ్యాపారవేత్తలు అని కొనియాడారు. ప్రకృతి వ్యవసాయం, ఫుడ్​ ప్రాసెసింగ్​, వ్యవసాయ సాంకేతికత, పునర్వినియోగ టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. 40 లక్షల మంది రిజిస్టర్​ చేసుకున్న జెమ్​ ఈ-మార్కెట్​ ప్లేస్​ పోర్టల్​ను పరిశీలించాలని జేఐటీఓ ప్రతినిధులకు సూచించారు. అందులోని చాలా మంది ఎంఎస్​ఎంఈ, ఎస్​హెచ్​జీలేనన్నారు. ప్రస్తుతం యావత్​ ప్రపంచం భారత్​వైపు చూస్తోందని, అది మనకు గౌర్వకారణమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: తెరుచుకున్న కేదార్​నాథ్​ ఆలయం.. మోదీ తొలిపూజ!

అవతార్​ 'పండోరా'ను మరిపించే అద్భుత ప్రపంచం.. మన దేశంలోనే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.