ETV Bharat / bharat

'మోదీ.. భగవంతుని అవతారం' - PM Modi avatar of God latest news

దేశాన్ని సరైన మార్గంలో నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. భగవంతుని అవతారమని పేర్కొన్నారు అరుణాచల్​ ప్రదేశ్​ ఎంపీ తాపిర్​ గావో. అసోం, బంగాల్​ రాష్ట్రాల్లోని తేయాకు కార్మికుల కష్టాలను తరిమికొట్టారని.. ఇది భగవంతుని (భగవాన్, అల్లా) అవతారం ద్వారా చేసిన పనిగా అభివర్ణించారు. మోదీ యుగపురుషుడని ఓ భాజపా నేత వ్యాఖ్యానించారు.

PM Modi 'avatar' of God who is taking nation in right direction: BJP's Arunachal MP
'ప్రధాని మోదీ మనిషి కాదు- భగవంతుని అవతారం'
author img

By

Published : Mar 19, 2021, 7:02 AM IST

ప్రధాని నరేంద్ర మోదీ దైవ స్వరూపమని వ్యాఖ్యానించారు అరుణచల్ ప్రదేశ్​ ఎంపీ తాపిర్​ గావో. దేశాన్ని సరైన మార్గంలో నడిపిస్తున్న భగవంతుడి అవతారమని పేర్కొన్నారు. బంగాల్​, అసోం రాష్ట్రాల్లోని తేయా కార్మికుల కోసం అహర్నిశలు పని చేస్తున్న మోదీ.. 'భగవాన్, అల్లా'తో సమానమని అభివర్ణించారు తాపిర్​. జమ్ముకశ్మీర్‌కు నిధుల కోసం అనుబంధ డిమాండ్లపై లోక్​సభలో జరిగిన చర్చలో ఈ వ్యాఖ్యలు చేశారు..

"ఆయన (ప్రధాని) మానవుడు కాదు. ప్రధానిగా మారి దేశాన్ని సరైన దిశలో నిడిపిస్తున్న భగవంతుడి అవతారం. భారతీయులుగా మనం గర్వపడాలి. అసోం, బంగాల్​లోని తేయాకు తోటల కార్మికుల సమస్యలను తరిమికొట్టే పని మోదీజీ చేశారు. ఇది భగవంతుని (భగవాన్, అల్లా) అవతారం ద్వారా చేసిన పనే."

- తాపిర్​ గావో, అరుణాచల్​ ప్రదేశ్​ ఎంపీ

అరుణాచల్​ సహా ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలను కొనియాడారు తాపిర్​. అసోం, బంగాల్​ తేయాకు తోటల కార్మికుల సంక్షేమం కోసం 2021-22 బడ్జెట్​లో రూ.1000 కోట్లు కేటాయించడాన్ని ప్రస్తావించిన గావో.. వారి జీవితాల్లో ప్రధాని ఆశలు రేకెత్తించారని పేర్కొన్నారు.

మోదీ.. యుగ పురుషుడు

భాజపా సిద్ధాంతకర్త శ్యామ్​ ప్రసాద్​ ముఖర్జీ కలలని సాకారం చేశారని ప్రధానిని ప్రశసించారు ఆ పార్టీ నేత జమ్యాంగ్ త్సేరింగ్ నాంగ్యాల్​. మోదీని యుగపురుషుడిగా అభివర్ణించారు. కొవిడ్​-19 వేళ మోదీ సర్కారు పలు చర్యలు తీసుకుందన్నారు. భారత్​ నేడు 100 దేశాలకు కరోనా టీకాలు సరఫరా చేస్తోందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'రాముడితో సమానంగా మోదీని చూస్తారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.