ETV Bharat / bharat

'ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా భారత్​' - IIT Kanpur convocation ceremony

IIT Kanpur Convocation: దేశం మరో స్వర్ణయుగంలోకి అడుగుపెడుతోదని .. సాంకేతికంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సార్టప్​ హబ్​గా అవతరించిందన్నారు. ఐఐటీ కాన్పుర్​ 54వ స్నాతకోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

PM Narendra Modi
PM Narendra Modi
author img

By

Published : Dec 28, 2021, 12:54 PM IST

Updated : Dec 28, 2021, 2:22 PM IST

IIT Kanpur Convocation: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా భారత్​ అవతరించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇండియన్​ ఇన్‌స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ(ఐఐటీ) విద్యార్థుల సహకారంతో దీన్ని సాధ్యమైందని ప్రధాని కితాబిచ్చారు. ఉత్తర్​ప్రదేశ్​లో ఐఐటీ కాన్పుర్​ 54వ స్నాతకోత్సవ వేడుకలకు ప్రధాని హాజరయ్యారు. ఐఐటీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ క్రమంలో మాట్లాడిన మోదీ.. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

IIT Kanpur convocation
స్నాతకోత్సవానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​

"75 ఏళ్ల స్వాతంత్య్ర భారత్​లో 75 కుపైగా యునికార్న్‌లు, 50,000కు పైగా స్టార్టప్‌లు ఉన్నాయి. వీటిలో 10,000 గడిచిన 6 నెలల్లో మాత్రమే వచ్చాయి. దీంతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా భారత్​ ఆవిర్భవించింది. ప్రధానంగా ఐఐటీ విద్యార్థుల సహాయంతో ఈ ఘనత సాధ్యమైంది."

- ప్రధాని నరేంద్ర మోదీ

"విద్యార్థులకు సాయం చేసే దిశగా.. గతేడేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కేంద్రం చేపట్టింది. జాతీయ విద్యా విధానం సహాయంతో యువత మరింత సమర్ధంగా పెద్ద సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది" అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆత్మనిర్భర్​భారత్ సాధించేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలన్నారు.

IIT Kanpur convocation
స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ
IIT Kanpur convocation
స్నాతకోత్సవంలో పాల్గొన్న విద్యార్థులు,అధికారులు

'వెలకట్టలేని బహుమతులను అందిస్తోంది'

సాంకేతిక ప్రపంచానికి ఐఐటీ కాన్పుర్ వెలకట్టలేని బహుమతులను అందజేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. 5జీ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో ఐఐటీ కాన్పుర్ సహకారం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. ఈ రోజు తనకు రెట్టింపు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఓ వైపు కాన్పుర్​లో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.. సాంకేతిక రంగంలో ఐఐటీ వెలకట్టలేనిదిగా మారుతోందని వ్యాఖ్యానించారు.

ఐఐటీ కాన్పుర్​కు రాకముందు విద్యార్థుల్లో తెలియని భయం ఉండేది.. అయితే ఇప్పుడు ప్రపంచాన్ని జయించగలమే నమ్మకం, ఏదైనా సాధించగలమే ధైర్యం,విశ్వాసం పెరిగిందన్నారు. దేశ భవిష్యత్​ యువత చేతిలో ఉందన్నారు. విద్యార్థుల తెలితేటలు, సృజనాత్మకతను మరింత బలోపేతం చేసిందని ఐఐటీ కాన్పుర్​ను ప్రశంసించారు.

2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో మోదీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, సదస్సులో పాల్గొంటున్నారు.

ఇదీ చూడండి: విక్రమ్​ మిశ్రికి డిప్యూటీ ఎన్​ఎస్​ఏ బాధ్యతలు

Last Updated : Dec 28, 2021, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.