ETV Bharat / bharat

PM Modi At Robot Gallery : రోబో గ్యాలరీలో మోదీ.. టీ తెచ్చి పెట్టిన 'చిట్టి' - రోబో గ్యాలరీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

PM Modi At Robot Gallery Gujarat : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్​లోని రోబోటిక్ గ్యాలరీలో సందడి చేశారు. అక్కడి భిన్నమైన రోబోలను వీక్షించిన ఆయన.. వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓ రోబో ఇచ్చిన టీని సేవించారు.

pm-modi-at-robot-gallery-gujarat
pm-modi-at-robot-gallery-gujarat
author img

By PTI

Published : Sep 27, 2023, 1:24 PM IST

PM Modi At Robot Gallery Gujarat : గుజరాత్​లోని అహ్మదాబాద్ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైన్స్​ సిటీని సందర్శించారు. అక్కడి రోబోలను ఆసక్తిగా తిలకించారు. రోబోటిక్ గ్యాలరీలో ఉన్న డీఆర్​డీఓ రోబోలు, మైక్రోబాట్​ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయం, వైద్యం, అంతరిక్షం వంటి వివిధ రంగాల్లో ఉపయోగించే భిన్నమైన రోబోలను మోదీ తిలకించారు. గ్యాలరీలో ఉన్న కేఫ్​ను సందర్శించిన ప్రధాని.. అక్కడి రోబోలు అందించిన టీని సేవించారు. మోదీ టేబుల్​పై కూర్చోగా.. ఓ రోబో.. ప్లేట్​లో టీ, బిస్కెట్లు తీసుకొని రావడం ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన చిత్రాలను మోదీ ట్విట్టర్​లో షేర్ చేశారు. వివిధ రంగాల్లో రోబోలు అనేక మార్పులు తీసుకొస్తున్నాయని మోదీ పేర్కొన్నారు.

  • #WATCH | PM Modi visits robot exhibition at Science City in Gujarat's Ahmedabad

    The PM will take part in a programme to mark the celebration of 20 years of Vibrant Gujarat Global Summit, here.

    Governor of Gujarat Acharya Devvrat and CM Bhupendra Patel also present pic.twitter.com/LXrLgbUjkd

    — ANI (@ANI) September 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"గుజరాత్ సైన్స్ సిటీలోని ఆకట్టుకునే రోబో గ్యాలరీని సందర్శించా. ఇక్కడ ప్రదర్శించిన రోబోల సామర్థ్యం అద్భుతం. ఈ సాంకేతికతలు యువతలో ఆసక్తిని పెంచుతుండటం సంతోషించాల్సిన విషయం. తయారీ, వైద్యం వంటి కీలక రంగాలతో పాటు రోజువారీ జీవితంలో రోబోలు తీసుకొస్తున్న మార్పు మనకు స్పష్టంగా తెలుస్తోంది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

Vibrant Gujarat Global Summit PM Modi : 'వైబ్రంట్ గుజరాత్ పెట్టుబడుల సదస్సు' 20వ వార్షికోత్సవం సందర్భంగా మోదీ అహ్మదాబాద్​లో పర్యటించారు. రోబో గ్యాలరీని సందర్శించిన అనంతరం 'వైబ్రంట్ గుజరాత్ సదస్సు'లో ప్రసంగించిన మోదీ.. భారత్​ను ప్రపంచ వృద్ధి ఇంజిన్​గా మార్చడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. త్వరలోనే భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కొన్నేళ్లలోనే భారత్ ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని పేర్కొన్నారు.

Modi On Congress : 'కాంగ్రెస్​ తుప్పు పట్టిన ఇనుము లాంటిది.. వర్షంలో పెడితే పూర్తిగా నాశనం!'

"20 ఏళ్ల క్రితం వైబ్రంట్ గుజరాత్ అనే చిన్న విత్తనాన్ని నాటాం. అది ఇప్పుడు మహా వృక్షమైంది. గుజరాత్​ను భారతదేశ వృద్ధి ఇంజిన్​గా మార్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టాం. 2014 తర్వాత భారత్​ను ప్రపంచ వృద్ధి ఇంజిన్​గా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నాం. భారత్ త్వరలోనే ఆర్థిక శక్తిగా రూపాంతరం చెందబోతోంది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

చిన్న కార్యక్రమంగా ప్రారంభమైన వైబ్రంట్ గుజరాత్.. భారీ సంస్థల పెట్టుబడులను ఆకర్షించేలా ఎదిగిందని మోదీ పేర్కొన్నారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం (యూపీఏ) పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉండేది కాదని విమర్శించారు. అలాంటి సమయంలో వైబ్రంట్ గుజరాత్ సదస్సు భారీ విజయం సాధించిందని చెప్పారు. 'ప్రతి పని మూడు దశలను దాటి విజయతీరాలకు చేరుతుంది. మొదట అవమానాలు భరిస్తుంది, తర్వాత వ్యతిరేకత ఎదుర్కొంటుంది, ఆ తర్వాత విజయవంతమవుతుంది' అని స్వామి వివేకానంద సూక్తులను మోదీ ఉదహరించారు.

  • Spent a part of the morning exploring the fascinating attractions at Gujarat Science City.

    Began with the Robotics Gallery, where the immense potential of robotics is brilliantly showcased.

    Delighted to witness how these technologies igniting curiosity among the youth. pic.twitter.com/ZA9XY1qWMN

    — Narendra Modi (@narendramodi) September 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Modi Rojgar Mela : 'మహిళలకు బీజేపీ సర్కార్​ సరికొత్త ద్వారాలు.. అన్ని రంగాల్లోనూ ముందంజ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.