ETV Bharat / bharat

బంగాల్​, అసోం, కేరళలో మోదీ, షా సుడిగాలి పర్యటన - అసోం, కేరళ, బంగాల్​లలో త్వరలో మోదీ, షాల ఎన్నికల ర్యాలీలు

ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ప్రచారానికి భాజపా జాతీయ నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. బంగాల్​, అసోం, కేరళలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా భారీ ర్యాలీలను నిర్వహించనున్నారు. మార్చి 18 నుంచి 27 వరకు సుడిగాలి పర్యటనలు చేయనున్నట్లు సమాచారం.

PM Modi, Amit Shah to hold marathon election campaigns in WB, Assam, Kerala
బంగాల్​, అసోం, కేరళల్లో మోదీ,షాల సుడిగాలి పర్యటన
author img

By

Published : Mar 12, 2021, 3:39 PM IST

Updated : Mar 12, 2021, 3:58 PM IST

త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో విజయమే లక్ష్యంగా ప్రచారహోరును పెంచునుంది భాజపా. ఈ దిశగా పార్టీ జాతీయ స్థాయి నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే వారం నుంచి మొదలుకొని ఈ నెల చివరి వరకు భారీ ర్యాలీలు నిర్వహించనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. బంగాల్, అసోం, కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటన చేయనున్నారు.

మార్చి 18 మొదలు..

బంగాల్​లోని పురలియాలో మార్చి 18తో శంఖారావం పూరించనున్న మోదీ.. ఆ రాష్ట్రంలో కాంటాయ్, బకురాల్లో మార్చి 20, 21తేదీల్లో​ నిర్వహించనున్న బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. షా కూడా భారీ బహిరంగ సభల్లో పాల్గొంటారు. మార్చి 17, 21, 23న అసోంలో విస్తృతంగా ర్యాలీలు నిర్వహించనున్న షా.. మార్చి 19, 26, 27 తేదీల్లో బంగాల్​లో భారీ రోడ్​ షోలు నిర్వహించనున్నారు. ఈ మధ్యలో మార్చి 24, 25న కేరళలను సైతం సందర్శించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. తాను భాజపా జాతీయ అధ్యక్షునిగా ఉన్నప్పుడు బంగాల్‌లో హత్యకు గురైన 122 మంది కార్యకర్తల కుటుంబాలను కూడా షా కలవనున్నారు.

మోదీ, షాల పైనే ఆశ..

ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్తున్న భాజపా.. ఈ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ, షా, అధ్యక్షుడు నడ్డా పర్యటనలపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. మోదీ ర్యాలీలతో ఆయా రాష్ట్రాల్లో పార్టీ కార్యకర్తలలో నూతన ఉత్తేజం కలుగుతుందని విశ్వసిస్తోంది. బిహార్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 100 నియోజకవర్గాల పరిధిలో 12 ర్యాలీలు, కర్ణాటక ఎన్నికల్లో 20కి పైనే ర్యాలీలు, ఉత్తర్​ప్రదేశ్​లో 110 అసెంబ్లీల పరిధిలో 20 ర్యాలీలు నిర్వహించారు మోదీ. ఈ కారణంగానే ఆయా రాష్ట్రాల్లో విజయం సాధించామని పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. ప్రస్తుతం బెంగాల్​లో 20, అసోంలో 6 సభలను నిర్వహించనున్నారు మోదీ. ఈ సారి కూడా విజయం తమదేనని భాజపా వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి మరిన్ని ర్యాలీలను మోదీ నిర్వహిస్తారని సమాచారం.

ఇదీ చదవండి: దండి పాదయాత్రను ప్రారంభించిన మోదీ

Last Updated : Mar 12, 2021, 3:58 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.