PM Kisan Samman Nidhi Amount Increase : దేశంలోని రైతన్నలకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ శుభవార్త చెప్పనుందా?.. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం.. ఈ సారి ఆ మొత్తాన్ని పెంచనుందా? అంటే అవుననే సంబంధిత వర్గాలు అంటున్నాయి. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేల మొత్తాన్ని రూ.8 వేలకు పెంచే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి.
సర్కార్ ఖజానాపై రూ.20వేల కోట్ల భారం!
PM Kisan Samman Nidhi Amount Release Date : అయితే నిజంగానే.. రూ.2 వేలు చొప్పున రైతులకు అదనంగా చెల్లించేందుకు బీజేపీ ప్రభుత్వం నిర్ణయిస్తే సర్కార్ ఖజానాపై రూ.20వేల కోట్ల మేర అదనపు భారం పడనుంది. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధిని వివరణ కోరగా.. అందుకు నిరాకరించినట్లు బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. దేశంలో 140 కోట్ల మందిలో దాదాపు 65 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని, నరేంద్ర మోదీ సర్కారు మూడోసారి అధికారంలోకి రావాలంటే వీరి ఓట్లు కీలకమని బ్లూమ్‌బెర్గ్ అభిప్రాయపడింది. భారత్‌లో మోదీనే పాపులర్ లీడర్ అయినప్పటికీ.. అసమానతలు, నిరుద్యోగం వంటి సమస్యలు సవాళ్లుగా మారనున్నాయని తెలిపింది.
గత సార్వత్రిక ఎన్నికల ముందు..
PM Kisan Samman Nidhi Amount Per Year : 2018లో గత సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. మూడు విడతలుగా 2 వేల రూపాయల చొప్పున రైతులకు నేరుగా బ్యాంక్ అకౌంట్లలో ఈ నిధులు జమ అవుతున్నాయి. అయితే నిధుల పెంపుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికల వేళ.. తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ పథకాన్ని మరోసారి పొడిగించే అవకాశం కూడా ఉందని తెలిసింది. దీంతో పాటు గృహ నిర్మాణానికి వడ్డీ రాయితీ పథకాన్ని కూడా త్వరలోనే కేంద్రం ప్రకటించవచ్చని సమాచారం.