దేశంలో వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లను వినియోగించాలంటూ సుప్రీంకోర్టులో అడ్వకేట్ సీఆర్. జయ సుకిన్ బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈవీఎంలలో ఓటింగ్ తప్పుగా నమోదవుతుందని, కచ్చితత్వం లోపిస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు.
"దేశవ్యాప్తంగా ఈవీఎం ఓటింగ్ విధానాన్ని మార్చాలి. ఈవీఎంలు ట్వాంపరింగ్కు గురి అవుతున్నాయి. సంప్రదాయ బ్యాలెట్ పేపర్లను వినియోగించాలి. ఏ దేశంలోనైనా బ్యాలెట్ ఓటింగ్ విధానంలో విశ్వసనీయత, పారదర్శకత ఉంటుంది."
-- పిటిషన్లో అడ్వకేట్ సీఆర్. జయ సుకిన్
ఈవీఎంలలో లోపం ఉందంటూ గతంలో వచ్చిన వార్తలను ఎన్నికల సంఘం పలుమార్లు ఖండించింది. ఈవీఎంలు సురక్షితం, ట్యాంపరింగ్ చేయటం అసాధ్యం అని తెలిపింది.
ఇదీ చదవండి :'ఫార్ములా 23'తో భాజపా 'బంగాల్ మిషన్-200'