ETV Bharat / bharat

'భర్త తరఫు కుటుంబానికే ఆస్తి హక్కులా?'

హిందూ వారసత్వ చట్టంలో లింగ వివక్షపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆ చట్టంలోని సెక్షన్‌ 15 రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ వేసిన పిటిషన్​పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. తొలుత హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్​కు సూచించింది.

Plea in SC against Hindu Succession law
సుప్రీం కోర్టు
author img

By

Published : Jul 13, 2021, 8:36 AM IST

హిందూ వారసత్వ చట్టంలోని లింగ వివక్షకు కారణమవుతున్న సెక్షన్‌ 15 రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ వేసిన పిటిషన్‌పై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ చట్టంలోని నిబంధన కారణంగా.. మరణించిన హిందూ మహిళ తన సొంత నైపుణ్యంతో ఆస్తిని సంపాదించినా.. ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోతే ఆ మొత్తం భర్త కుటుంబానికి దక్కుతోందని పిటిషన్‌వేసిన మంజు నారాయణ్‌ పేర్కొన్నారు. మహిళ తరఫు కుటుంబానికి ఎలాంటి హక్కులు ఉండడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మంజు నారాయణ్‌.. కుమార్తె, అల్లుడు ఇటీవల కరోనాతో మృతి చెందారు. వారు ఎలాంటి వీలునామా రాయలేదు. అయితే తన కుమార్తె.. సొంత తెలివితేటలతో దాదాపు రూ.2 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించిందని. ఇప్పుడు హిందూ వారసత్వ చట్టం నిబంధనల కారణంగా ఆ ఆస్తి భర్త తరఫు బంధువులకే చెందుతోందని.. ఇది అన్యాయమని ఆమె తన పిటిషన్‌లో తెలిపారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్‌ అబ్దుల్‌నజీర్‌, జస్టిస్‌ కృష్ణమురారీలతో కూడిన ధర్మాసనం.. హైకోర్టును ఆశ్రయించాలని, తొలుత ఆ కోర్టు తీర్పును కోరాలని తెలిపింది.

పరువు హత్య కేసులో బెయిల్‌ రద్దు

పరువు హత్య కేసులో నిందితుడికి రాజస్థాన్‌ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేసింది. జైపుర్‌కు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నందుకు 2017లో కేరళ యువకుడు అమిత్‌ నాయర్‌ను.. యువతి సోదరుడు ముకేశ్‌ చౌధరి కాల్చి చంపారు. ఈ కేసును సోమవారం విచారించిన ధర్మాసనం చౌధరికి బెయిలివ్వడం సరైంది కాదని అభిప్రాయపడింది.

ఇదీ చూడండి: సహకార సంఘాలపై పట్టు కోసమే కొత్త శాఖ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.