ETV Bharat / bharat

సుప్రీంకు 'పెగాసస్' వ్యవహారం- సిట్ దర్యాప్తునకు విజ్ఞప్తి

పెగాసస్​ స్పైవేర్​ అంశం ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై సిట్​తో దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అది భారత ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పిటిషనర్​ పేర్కొన్నారు.

author img

By

Published : Jul 22, 2021, 12:15 PM IST

Updated : Jul 22, 2021, 1:34 PM IST

PEGASUS
పెగాసస్

పెగాసస్​ గూఢచర్యం వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో (సిట్​) కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. పాత్రికేయులు, కార్యకర్తలు, రాజకీయ నాయకులు, ఇతరులపై ఈ స్పైవేర్​ సాయంతో ప్రభుత్వ సంస్థలు నిఘా పెట్టాయనే ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో న్యాయవాది ఎంఎల్ శర్మ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.

పెగాసస్​ కుంభకోణం తీవ్ర ఆందోళనకరమని శర్మ అన్నారు. అది భారత ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ, దేశ భద్రతపై జరిగిన ముప్పేట దాడేనని పిటిషన్​లో ఆయన పేర్కొన్నారు. విస్తృత, బాధ్యతారాహిత్యమైన నిఘా అనైతికమని చెప్పారు.

'చట్ట విరుద్ధంగా ప్రకటించాలి'

పెగాసస్​ రూపకర్త ఎన్​ఎస్​ఓ గ్రూపునకు చెందిన 50వేలకు పైగా క్లయింట్ల ఫోన్​ నెంబర్లు లక్ష్యంగా చేసుకున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. పెగాసస్​ కేవలం నిఘా సాధనం కాదని, భారత రాజ్యాంగంపై ఎక్కుపెట్టిన సైబర్​ ఆయుధమని ఆరోపించారు. ఈ సాఫ్ట్​వేర్​ను నిఘా కోసం కొనుగోలు చేయడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు.

ఇవీ చూడండి:

Last Updated : Jul 22, 2021, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.