ETV Bharat / bharat

'భారత్​లో ఏటా 85 కోట్ల స్పుత్నిక్ డోసుల ఉత్పత్తి' - స్పుత్నిక్ టీకా రష్యా

భారత్​లో ఏడాదికి 85 కోట్ల స్పుత్నిక్ వీ టీకా డోసులు ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు రచించినట్లు రష్యా రాయబారి నికోలాయ్ కుదాషెవ్ తెలిపారు. త్వరలోనే వీటి ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు. రష్యా నుంచి భారత్​కు వచ్చిన డోసులు దేశం​లో వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు ఉపయోగపడతాయని అన్నారు.

SPUTNIK
'భారత్​లో ఏటా 85 కోట్ల స్పుత్నిక్ టీకాల ఉత్పత్తి'
author img

By

Published : May 2, 2021, 5:40 AM IST

Updated : May 2, 2021, 9:09 AM IST

భారత్​కు తొలి విడత స్పుత్నిక్ వీ డోసులు అందడంపై రష్యా రాయబారి నికోలాయ్ కుదాషెవ్ హర్షం వ్యక్తం చేశారు. రష్యా అందించిన డోసులు భారత్​లో వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు ఉపయోగపడతాయని అన్నారు. భారత్​లో ఈ టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని క్రమంగా ఏడాదికి 85 కోట్లకు చేర్చనున్నట్లు చెప్పారు. కరోనా పోరులో రష్యా, భారత్ సంయుక్తంగా పనిచేస్తున్నాయని గుర్తు చేశారు.

"స్పుత్నిక్ వీ స్థానిక ఉత్పత్తి త్వరలోనే ప్రారంభం కానుంది. క్రమంగా టీకా ఉత్పత్తిని ఏడాదికి 85 కోట్ల డోసులకు చేర్చేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. మహమ్మారిని అడ్డుకునేందుకు భారత్​తో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఎదురుచూస్తున్నాం."

-నికోలాయ్ కుదాషెవ్, రష్యా రాయబారి

ప్రపంచంలోనే అత్యంత సమర్థమంతమైన టీకాల్లో స్పుత్నిక్ వీ ఒకటని కుదాషెవ్ అన్నారు. కొత్త వేరియంట్లపైనా ఇది ప్రభావవంతంగా పనిచేస్తోందని చెప్పారు.

ఇదీ చదవండి- మోడెర్నా టీకాకు డబ్ల్యూహెచ్​ఓ పచ్చ జెండా

Last Updated : May 2, 2021, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.