ETV Bharat / bharat

విజయన్ 2.0: మంత్రివర్గంలో మొత్తం కొత్తవారే

author img

By

Published : May 18, 2021, 5:02 PM IST

కేరళలో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోన్న సీఎం పినరయి విజయన్.. పూర్తిగా నూతన మంత్రివర్గంతో రానున్నారు. విజయన్ మినహా గతంలో మంత్రులుగా పనిచేసిన ఎవరికీ ఈ దఫా కేబినెట్​లో చోటుదక్కలేదు.

Pinarayi 2.O Comes With Fresh Faces In The Cabinet
కేరళ కేబినెట్ లో పూర్తిగా కొత్తవాళ్లకే చోటు

కేరళలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టనున్న సీపీఎం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ మినహా నూతన కేబినెట్​లో పాతవాళ్లెవరికీ చోటు కల్పించలేదు. కొవిడ్ కట్టడి చర్యలతో ప్రాచుర్యంలోకి వచ్చిన ఆరోగ్య మంత్రి కేకే శైలజకూ ఈసారి అవకాశం దక్కలేదు. ఆమె ఇకపై పార్టీ విప్​గా వ్యవహరించనున్నారు.

ఈ విషయంలో సీఎం విజయన్​ మినహా ఎవరికీ మినహాయింపు ఇవ్వరాదని సీపీఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని కొడియేరి బాలకృష్ణణ్ ప్రతిపాదించారు.

కొత్తనీరు..

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కే రాధాకృష్ణణ్, ఎంవీ గోవిందన్, పీ రాజీవన్, కేఎన్ బాలగోపాల్​తో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు సాజి చేరియన్, వీఎన్ వాసవన్, వీ శివన్ కుట్టి, మహ్మద్ రియాజ్​కు నూతన ఎల్​డీఎఫ్​ ప్రభుత్వంలో మంత్రి పదవులు దక్కాయి. మహిళా ఎమ్మెల్యేలు వీణా జార్జి, ఆర్ బిందుకు కేబినెట్​లో చోటు లభించింది.

తానూర్ ఎమ్మెల్యే వీ అబ్దుల్ రహ్మాన్​కూ నూతన మంత్రివర్గంలో స్థానం దక్కింది. థ్రితల ఎమ్మెల్యే ఎంబీ రాజేశ్ స్పీకర్​గా వ్యవహరించనున్నారు. అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో అనుసరించే.. 'కొత్త తరానికి అవకాశం' వ్యూహాన్నే ఇక్కడా అమలుచేసింది సీపీఎం.

సీపీఐ నుంచి ప్రసాద్, రాజన్, చించురాణి, జీఆర్ అనిల్​కు కేబినెట్ లో చోటుదక్కింది.

ఇదీ చూడండి: కేరళ సీఎం ప్రమాణ స్వీకారానికి అడ్డంకులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.