ETV Bharat / bharat

రూ.2వేల నోట్ల మార్పిడిపై పిటిషన్​.. అందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు - దిల్లీ అధికారాలపై సుప్రీంకోర్టు

Pil On 2000 Notes : ఎటువంటి గుర్తింపు కార్డు, అభ్యర్ఖన పత్రం లేకుండా రూ.2 వేల నోట్ల మార్పిడిని అనుమతించాలన్న ఆర్​బీఐ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్​ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మరోవైపు.. దిల్లీలో ఉన్నతాధికారులపై కేంద్రానికి నియంత్రణ ఉండేలా తీసుకొచ్చిన ఆర్డినెన్స్​పై సోమవారం విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఈ క్రమంలో కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

Pil On 2000 Notes
Pil On 2000 Notes
author img

By

Published : Jul 10, 2023, 4:03 PM IST

Updated : Jul 10, 2023, 4:42 PM IST

Pil On 2000 Notes : ఎటువంటి గుర్తింపు కార్డు, అభ్యర్థన పత్రం లేకుండా 2 వేల రూపాయల నోట్ల మార్పిడిని అనుమతించాలన్న ఆర్​బీఐ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆర్​బీఐ నిర్ణయాన్ని సమర్థిస్తూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన అప్పీలును ధర్మాసనం కొట్టివేసింది. ఇది కార్యనిర్వాహక విధానమైన నిర్ణయమని సీజేఐ జస్టిస్‌ DY చంద్రచూడ్‌, జస్టిస్‌ PS నరసింహలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

కొన్నాళ్ల క్రితం రూ.2 వేల నోట్ల మార్పిడిపై దాఖలైన పిటిషన్​ను అత్యవసరంగా విచారించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది సుప్రీం కోర్టు. ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా రూ.2 వేల నోట్ల మార్పిడికి అవకాశాన్ని కల్పించడాన్ని సవాల్ చేస్తూ సీనియర్ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ​ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన జస్టిస్​ అనిరుద్ధ బోస్​, జస్టిస్​ రాజేశ్ బిందాల్​తో కూడిన ధర్మాసనం.. ఈ కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని శుక్రవారం చెప్పింది. వేసవి సెలవుల అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీవై చంద్రచూడ్​ ధర్మాసనం వాదనలు వింటుందని స్పష్టం చేసింది. ముఖ్యమైన అంశాన్ని విచారణకు స్వీకరించకపోవడం దురదృష్టకరమని అశ్విని కుమార్​ ఉపాధ్యాయ చెప్పారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. ఇది కోర్టని.. బహిరంగ వేదిక కాదంటూ.. ఇంతటితో వాదనలు ముగించాలని తేల్చి చెప్పింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Delhi Ordinance Supreme Court : మరోవైపు, దిల్లీలో ఉన్నతాధికారులపై నియంత్రణ.. కేంద్రానికే ఉండేలా బీజేపీ సర్కార్ తెచ్చిన ఆర్డినెన్స్‌పై సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ దిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై CJI జస్టిస్ డీవై చంద్రచూడ్‌, జస్టిస్ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కూడా ప్రతివాదిగా చేర్చుతూ పిటిషన్‌లో సవరణ చేయాలని సూచించింది. తదుపరి విచారణను జులై 17కు వాయిదా వేసింది.

దిల్లీలో పోలీసులు, శాంతిభద్రతలు, భూమి మినహా.. మిగిలిన అధికారాలన్నీ ఎన్నికైన ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. దిల్లీ సహా కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన గ్రూప్‌-A అధికారుల బదిలీ, క్రమశిక్షణ చర్యల కోసం నేషనల్ కేపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో దిల్లీలో సర్వీసులపై.. కేంద్రానికే అధికారాలు ఉండేలా బీజేపీ సర్కార్‌ ఆర్డినెన్స్ తెచ్చింది. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌.. సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించడమే కాకుండా రాజ్యాంగానికి వ్యతిరేకమని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం.. పిటిషన్‌లో పేర్కొంది. ఆర్డినెన్స్‌పై మధ్యంతర స్టే ఇవ్వాలని కోరింది.

Last Updated : Jul 10, 2023, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.